Andrapradesh: భారీ వర్షాలు విజయవాడను అతలకుతలం చేశాయి.విజయవాడ చరిత్రలో ఎప్పుడు చూడని వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది చరిత్రలోనే ఇలాంటి వరద ఉదృతిని ఎప్పుడు చూడలేదని విజయవాడ వాసులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా విజయవాడం మొత్తం కూడా జలమయంగా మారింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరికొందరికి తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి. ప్రభుత్వం అందిస్తోన్న సాయం అన్ని ప్రాంతాలకు చేరడం లేదు.
వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం, పాలు, నీళ్లు అందిస్తున్నా క్షేత్రస్థాయిలో కొందరు వాటిని సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే గతంలో ఇంతకన్నా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు కూడా విజయవాడకు ఏం కాలేదు. కాని ఇప్పుడు ఒక్కరోజు కురిసిన వర్షానికే పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని కాపాడటానికే విజయవాడను ముంచేశారనే విమర్శలు తెర మీదకు వస్తున్నాయి. వరద నీరు అమరావతికి చేరితే రాజధానిపై అనుమానాలు వస్తాయనే ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
అమరావతి మీదగా రావాల్సిన వాటర్‌ను వెలగలేరు మీద నుంచి మళ్లించడంతో ఆ వరద నీరు విజయవాడను ముంచేత్తాయి. ఇదే విషయాన్ని జగన్ సైతం చెప్పడం జరిగింది. చంద్రబాబు ఇల్లు ఎక్కడ మునుగుతోందో అని కవులూరు దగ్గర హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తెరు అధికారులు. దీంతో వరదలు విజయవాడను ముంచేత్తాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే బుడమేర వాగుకి అసలు గేట్లు లేవని చంద్రబాబు చెప్పడం చాలా విడ్డురంగా అనిపించింది.ఇంత అవగాహన లేకుండా ఆయన మాట్లాడటం నిజంగా సిగ్గుచేటని విజయవాడ వాసులు చెబుతున్నారు. 11 గేట్లను ఎత్తెమని నీటిపారుదలశాఖ ఇంజినీర్ సతీష్ చెడుతుంటే, అసలు గేట్లు లేవని చంద్రబాబు చెప్పడం సంచలనంగా మారింది. తన ఇంటిని, అమరావతిని కాపాడుకోవడానికి చంద్రబాబు చేసిన ఈ పనికి నేడు విజయవాడ మొత్తం కూడా జలమయంగా మారేలా చేసింది. మరి దీనిపై చంద్రబాబు ప్రభుత్వం ఎలా వివరణ ఇస్తుందో చూడాలి.