Thursday, October 3, 2024

Etela Rajender: ఈటెల రాజేందర్ భారీ స్కెచ్..ఆ ఆలోచనతోనే ఆ స్టెప్

- Advertisement -

Etela Rajender: బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ దూకుడు పెంచారు. పార్టీలో చాలా యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీని వెనుక భారీ స్కెచ్ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసమే ఆయన పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ చీఫ్‌ పదవి ఎవరికి ఇస్తారనే దానిపై హైకమాండ్ క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుత ప్రెసిడెంట్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బిజీబిజీ అయిపోయారు. కేంద్రమంత్రిగా ఆయన ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారు. దాంతో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేంత సమయం ఆయనకు లేకుండా పోయింది. పైగా బీజేపీలో ఒక వ్యక్తికి ఒకటే పదవి అనేది ఉంది. దాంతో కొత్త చీఫ్‌ను నియమించాలని హైకమాండ్‌ భావిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండడం.. తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ టార్గెట్ చేసుకోవడంతో అధ్యక్ష పదవికి గిరాకీ పెరిగింది.

రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లోపు పార్టీకి కొత్త నాయకత్వం వస్తే పార్టీ గ్రామ గ్రామాన విస్తరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పార్టీ అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్‌, ధర్మపురి అరవింద్‌, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ముందు వరుసలో ఉన్నారు. వీళ్లే కాకుండా ఒకరిద్దరూ డీకే అరుణ, రఘునందన్ రావు పేర్లు సైతం రేసులో ఉన్నట్టు తెలిసింది. అయితే పార్టీ చీఫ్‌ పదవిపై కన్నేసిన ఎంపీ ఈటెల రాజేందర్ ఎక్కువగా ప్రజాక్షేత్రంలో ఉంటేనే తనకు కలిసివస్తుందని భావిస్తున్నారట. అందుకే ఎక్కువగా మీటింగ్‌లకు హాజరవుతూ.. హైడ్రా కూల్చివేతలపైన కూడా స్పీడ్‌ పెంచినట్టు టాక్‌ వినిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందు బీజేపీలో చేరారు ఈటెల రాజేందర్‌.. పార్టీలో చేరగానే ఆయనకు కీలక పదవి దక్కబోతుందని ప్రచారం జరిగింది. అంతలోపు ఎన్నికలు రావడంతో కమలం పార్టీ బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో బరిలో దిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. దాంతో రాష్ట్ర చీఫ్‌ పదవిని బీసీ నేతకు ఇవ్వాలనే డిమాండ్లు వినిపించాయి. దాంతో అధ్యక్ష పదవి ఈటెలకే అన్నట్టు ప్రచారం సాగింది. అదే సమయంలో పార్లమెంటు ఎన్నికలు జరగడంతో ఈటెల రాజేందర్‌ ఎంపీగా పోటీ చేశారు. మల్కాజ్‌గిరి నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. దాంతో ఈటెలకు మంత్రి పదవి రాబోతుందని చెప్పారు. కానీ కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌కు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కడంతో.. ఈటెలకు రాష్ట్ర చీఫ్‌ పదవిపై ఆశలు మరింత రెట్టింపు అయ్యాయి.

అయితే సార్వత్రిక ఎన్నికలు జరిగి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. కానీ ఇప్పటివరకు కొత్త అధ్యక్షుడి నియామకమే జరగలేదు. ఈ సీన్లన్నీ గమనించిన ఈటెల రాజేందర్‌ చివరకు ప్రజా క్షేత్రంలోనే ఉంటూ పోరాడటమే శరణ్యమని నమ్మారు. ఎక్కువ సమయం ప్రజల్లో ఉంటే.. మరింత గుర్తింపు వస్తుందని అనుకుంటున్నారట.. అందుకే ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. మరోవైపు హైడ్రా కూల్చివేతల్ని ఈటెల రాజేందర్ విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే హైడ్రా బాధితులకు మద్దతుగా కొత్తపేటలోని గణేష్ నగర్‌లో ఎంపీ ఈటల రాజేందర్ ధర్నాకు దిగారు. అక్కడ బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్న ఈటల హైడ్రా కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో రేవంత్‌ రెడ్డి సర్కార్ హైడ్రామా చేస్తుందని మండిపడ్డారు.

కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ప్రటించింది. బీసీ నేతకే టీసీసీ ఛీప్ పదవి ఇచ్చింది. అటు బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా వర్కింగ్‌ ప్రెసిడెంట్ పదవిని బీసీ నేతకు ఇవ్వాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తాము మరో సామాజికవర్గానికి రాష్ట్ర చీఫ్ పదవి ఇస్తే తేడా వస్తుందనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలిసింది. అందుకే బీసీ నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో పార్టీ ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఈటెల రాజేందర్‌ ప్రజా క్షేత్రంలో దూసుకెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే ఈటెల రాజేందర్ భారీ స్కెచ్ తో ఉన్నారన్న మాట.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!