YSRCP: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సబ్ జైలు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ మరియు కూటమి కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. రిమాండ్‌లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు సోమవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామి రెడ్డి ధర్మవరం సబ్ జైలుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి కార్యకర్తలు ఆయనపై దాడికి దిగారు. దీంతో కూటమి కార్యకర్తలు మరియు వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కేతిరెడ్డి వెంకట రామి రెడ్డి వాహనాన్ని కూటమి కార్యకర్తలు అడ్డుకున్నారు. ముందుకు కదలకుండా ఆయన కారును చుట్టుముట్టారు. ఈ క్రమంలో కారు పైకి ఎక్కేందుకు ఒక కూటమి కార్యకర్త ప్రయత్నం చేశారు. అయితే కేతిరెడ్డి వెంకట రామి రెడ్డి కారును వేగంగా ముందుకు నడుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ కార్యకర్త కార్ పైనుంచి కింద పడిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టి౦ట చాలా వైరల్ అవుతోంది.
ఇక ఈ ఇష్యూపై ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ స్పందించారు. కేతిరెడ్డి వెంకట రామి రెడ్డి తీరుపై ఎమ్మెల్యే సత్యకుమార్ మండిపడ్డారు. ఓటమితో కేతిరెడ్డి వెంకట రామి రెడ్డి మైండ్ బ్లాక్ అయ్యి ప్రజల పైకి తన వాహనాన్ని నడిపి గుద్దుకుంటూ వెళ్లిపోయారని మండిపడ్డారు. గతంలో చేసిన తప్పులకు కబ్జాలకు మరియు దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం నేర్పినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే అది త్వరలోనే తీరుస్తామని చెప్పారు. ధర్మవరం ప్రజలకు చిన్న కీడు చేపట్టినా సహించమని వాటి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గుర్తు పెట్టుకోవాలని కేతిరెడ్డి వెంకట రామి రెడ్డిని సత్యకుమార్ హెచ్చరించారు.
కేతిరెడ్డి వెంకట రామి రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. కేతిరెడ్డి వెంకట రామి రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కూడా టైమ్ వస్తుందని అప్పుడు తనేంటో చూపిస్తానని కేతిరెడ్డి వెంకట రామి రెడ్డి హెచ్చరించారు. ప్రతి లెక్కా సారాన్ని సరి చేస్తానని కొత్త వాళ్లు వస్తుంటారు, పోతుంటారు కానీ తను లోకల్ అని అన్నారు. గొడవలు వద్దని తమ నాయకులు మరియు కార్యకర్తలను కట్టడి చేశానని ఆయన తెలిపారు. ప్రభుత్వ హామీలను సంవత్సరం తర్వాత ప్రశ్నిద్దామని అనుకున్నానని ఆయన అన్నారు. కానీ ధర్మవరంలో ప్రజా సమస్యలు పరిష్కరించే ఆనవాయితీ పోయిందని గొడవలను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. పీఏల చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జమిలీ ఎన్నికలు జరిగితే ఏపీలోని ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. తనని అడ్డుకున్న వారిపై చట్టపరంగా పోరాడతామని ఈ సందర్భంగా కేతిరెడ్డి వెంకట రామి రెడ్డి పేర్కొన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకి ఎంతో మంచి చేసినా సరే ఓడిపోయానే బాధలో కేతిరెడ్డి ఇన్ని రోజులు బయటికి రాలేదని అక్కడ వైసీపీ క్యాడర్ కూడా చాలా నిరాశలో ఉన్నారని ఇప్పుడు ఆయన మళ్ళీ మునుపటి ఉత్సాహం చూపిస్తున్నారని క్యాడర్ భావిస్తున్నారట. దీంతో ఎలక్షన్ ఓడిపోయామని బాధలో ఉన్న వైసీపీ శ్రేణులకి ఇది చాలా గుడ్ న్యూస్ అని వారు అభిప్రాయ పడ్డారు.