Chandrababu: తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల కేంద్రం నాలుగు మెడికల్ కాలేజీలు కేటాయించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు కేంద్రం కనీసం ఒక మెడికల్ కాలేజీ కూడా కేటాయించలేదు అనే అనుమానం రావచ్చు ఎవరికైనా. అసలు సంగతి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే మాకు మెడికల్ కాలేజీలు వద్దని మెడికల్ సీట్లు కూడా వద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాసిందట. ఇంత దుర్మార్గమా, మరీ ఇంత నీచంగా ఏ ప్రభుత్వమైనా ప్రవర్తిస్తుందా అని ప్రస్తుతం రాష్ట్రంలో ఈ అంశం చాలా చర్చనీయా౦శమైంది. పులివెందుల మెడికల్ కాలేజీతో పాటు ఈ సంవత్సరం మరో అయిదు మెడికల్ కాలేజీలకు తరగతులు ప్రారంభం అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించిన పాపాన పోలేదని విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన అధికార౦లో ఉన్నప్పుడు 18 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉంటే ఆయన స్వయంగా పన్నెండు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చారు. కానీ ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదు.
గతంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయిదేళ్ళలో ఏకంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించారు. వాటిలో ఇప్పుడు అయిదు మెడికల్ కాలేజీలకి తరగతులు ప్రారంభమవ్వాల్సి ఉండగా చంద్రబాబు ప్రభుత్వం వాటిని పూర్తిగా పక్కన పెట్టేసింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామిగా ఉండి కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా సాధించుకోకపోగా ఆయనే స్వయంగా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు వద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాయడం ఇప్పుడు చాలా వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు నాయుడు గతంలో లాగే ఇప్పుడు కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలకి అనుమతి ఇస్తారని ఆయనకి సంబంధించిన ఇద్దరు ముగ్గురు పారిశ్రామిక వేత్తలు మరియు అనుచరుల ఎదుగుదలే ఆయనకి కావాలని రాష్ట్ర౦లో విద్యార్ధుల భవిష్యత్తు గురించి పట్టించుకోరని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. మెడికల్ కాలేజీ సీట్లని వెనక్కి తీసుకోమని కేంద్రానికి ఎందుకు లేఖ రాశారో విద్యార్ధులకి మరియు వారి తల్లిదండ్రులకి ప్రభుత్వం సమాధాన౦ చెప్పాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుంది అని వైసీపీ నేతలు ఆగ్రహ౦ వ్యక్తం చేస్తున్నారు. చివరికి ప్రభుత్వ ఆసుపత్రులను కూడా త్వరలో ప్రైవేటీకరించబోతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఒక నియోజకవర్గానికి ఒక ఆసుపత్రి కింద పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యార్ధులకి ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో తెచ్చిన ప్రభుత్వ కాలేజీలని విద్యార్ధులకి అందుబాటులోకి తీసుకురాకుండా వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు పట్ల కేంద్రం కూడా చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం.