Thursday, March 28, 2024

ఏంటమ్మా శ్రీదేవి ఈ సమయంలో ఇలా చేస్తా ఎలా..?

- Advertisement -

2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ తిరిగి అంటే 2024 ఎన్నికల్లో కూడా అంతకంటే ఘన విజయాన్ని నమోదు చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే 175 సీట్లగాను 175 సీట్లు గెలవాలని పార్టీ అధినేత జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు. పనితీరు బాలేని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని జగన్ నాయకులకు తేల్చిచెప్పారు. ఈక్రమంలోనే తొటి వేటు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై పడింది. రాజధాని అమరావతి పరిధిలోని ఎమ్మెల్యేపైనే తొలివేటు వేశారు జగన్. ఎమ్మెల్యే శ్రీదేవిపై సొంత పార్టీ నేతలే అనేక ఫిర్యాదులు చేయడం జరిగింది. అనేక అక్రమాలకు పాల్పడటంతో..ఆమెను నియోజకవర్గ ఇంచార్జ్‌గా తప్పిస్తూ.. ఆమె స్థానంలో డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తనని నియోజకవర్గ ఇంచార్జ్‌గా తప్పించడంపై ఎమ్మెల్యే శ్రీదేవి అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికి కూడా ఆమెను పట్టించుకున్న నాథుడే లేదు. డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించిన కొద్ది రోజులకే కత్తెర సురేష్ కుమార్‌ను అదనపు ఇంచార్జ్‌గా నియమించింది. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు ఎమ్మెల్యే శ్రీదేవికి టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఉన్న వివాదాలు చాలవు అన్నట్లు.. తాజాగా ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో ఇరుకున్నారు.

తాడికొండ మార్కెట్ కమిటీ వ్యవహారంలో కలుగజేసుకుని వైసీపీ అధిష్టానానికి మరింత ఆగ్రహం తెప్పించినట్లు అయింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…తాడికొండ మార్కెట్ కమిటీలో పదవుల కోసం ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవి ఒక జాబితాను సిద్దం చేసింది. ఇదే సమయంలో కొత్తగా ఇంచార్జ్‌గా వచ్చిన కత్తెర సురేష్ కుమార్‌ కూడా తన అనుచరులతో మరో జాబితాను సిద్దం చేశారు.ఏం జరిగిందో ఏమో గానీ.. ఉండవిల్లి శ్రీదేవి ఇచ్చిన జాబితా పేర్లను మార్కెట్ కమిటీకి ప్రకటిస్తూ అధికార్లు ఉత్తర్వులు జారీచేశారు. ఈ విషయం తెలుసుకున్న కత్తెర సురేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఉదయం ప్రమాణ స్వీకారం జరిగితే.. సాయంత్రంలోగా.. అసలు ఆ నియామకపు ఉత్తర్వులనే అబేయెన్స్ లో పెట్టించారు. శ్రీదేవి వర్గానికి చెందిన నాయకులకు పదవి దక్కిందనే ఆనందం అస్సలు లేకుండాపోయింది. మార్కెట్ వివాదంతో వైసీపీ అధిష్టానానికి శ్రీదేవి మరింత ఆగ్రహానికి గురైందని తెలుస్తోంది. మరి ఈ మహిళ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తు ఎలా మారుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!