Thursday, October 3, 2024

Hyderabad Metro: జాతీయ స్థాయిలో పడిపోతున్న హైదరాబాద్ మెట్రో..

- Advertisement -

Hyderabad Metro: సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వంతో పదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అత్యుత్తమంగా ఎదుగుతూ వచ్చింది. హైదరాబాద్‌ మహానగరం అన్ని రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు, అత్యుత్తమ స్థానాలను సొంతం చేసుకుంది.అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు మహా నగరానికి శాపంగా మారాయి. ఎప్పటికప్పుడు వైఫల్యాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మిగులుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఏడేళ్ల కిందట మెట్రో ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసింది కేసీఆర్ సర్కారు. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌ మెట్రో రైలు ఘన చరిత సొంతం చేసుకుంది. మహానగరంలో అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ఇష్టారాజ్యంగా మార్చివేసింది. గత కేసీఆర్‌ ప్రభుత్వం మొత్తం 415 కిలోమీటర్ల మేర నగరం నలుమూలలా మెట్రో మార్గాలను దశల వారీగా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. క్షేత్ర స్థాయిలో పనులు చేపడితే వాటిని పూర్తిగా రద్దు చేసింది రేవంత్ సర్కారు. కొత్త మార్గాలను 70 కిలోమీటర్లకు పరిమితం చేసి తాజాగా ప్రతిపాదించింది.

మెట్రో ప్రాజెక్టు విషయంలో గత తొమ్మిది నెలల కాలంలో రేవంత్ సర్కారు సాధించింది శూన్యం. కొత్తగా ఒక్క మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. ఒక్క కిలోమీటరు మెట్రో మార్గం నిర్మాణం జరగడం లేదు. దీంతో దేశంలో హైదరాబాద్‌ మెట్రో రైలు స్థానం 5వ స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు 70 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన 7 మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయలేని దుస్థితి కాంగ్రెస్‌ ప్రభుత్వానిది. ఒకవైపు హైదరాబాద్‌ కంటే వెనకబడి ఉన్న చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాల్లో 100కు పైగా కిలోమీటర్ల మార్గాలు నిర్మాణంలో ఉంటే, హైదరాబాద్‌లో మాత్రం నిర్వహణలో ఉన్నది కేవలం 69 కిలోమీటర్లు మాత్రమే. ఇక ప్రతిపాదన దశలో ఉన్న 70 కిలోమీటర్ల మార్గానికి ఎప్పుడు డీపీఆర్‌ వస్తుంది? దానికి కేంద్రం నుంచి అనుమతులు, నిధుల కేటాయింపు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

హైదరాబాద్ మెట్రో మార్గాన్ని రూపకరణ చేసింది కేసీఆర్ సర్కారు. అందుకే గ్రేటర్ లో బీఆర్ఎస్ కు ఎంతో ఆదరణ. మొన్నట ఎన్నికల్లో నగర పరిధిలో బీఆర్ఎస్ గెలుపునకు కారణం కూడా మెట్రో ప్రాజెక్టే. ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) మోడల్‌లో సుమారు రూ.14,132 వేల కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు. 2017 నవంబర్‌ నుంచి ఎల్‌బీనగర్‌-మియాపూర్‌, జేబీఎస్-ఎంజీబీఎస్‌, నాగోలు-రాయదుర్గం కారిడార్ల పరిధిలోని 69.2 కిలోమీటర్ల మార్గంలో రైళ్లు నడుస్తున్నాయి. ఆరంభంలో హైదరాబాద్‌ మెట్రోరైలు అధికారులు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్‌అండ్‌టీ అధికారులు తీవ్రంగా కృషి చేసి ఆయా కారిడార్లలో పిల్లర్ల నిర్మాణానికి కావాల్సిన ఆస్తుల సేకరణకు పకడ్బందీగా చేశారు. సమర్థవంతంగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి వచ్చారు.

ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్న రైళ్లు రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా నడుస్తూ అన్ని వర్గాల ప్రజలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రతి 3 నుంచి 6 నిమిషాలకోసారి రైలు వస్తుండడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొవిడ్‌ కాలంలో ప్రయాణికుల సంఖ్య కొంతమేరకు తగ్గినా మళ్లీ పుంజుకుంది.కారిడార్‌-1లోని ఎల్‌బీనగర్‌లో రోజుకు 40 నుంచి 50 వేల మంది, కారిడార్‌ 3లోని రాయదుర్గంలో 35 నుంచి 40 వేల మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కారిడార్‌-2 జేబీఎ్‌స-ఎంజీబీ ఎస్‌లో తక్కువ మొత్తంలో ఉంటున్నారని, ఈ మార్గంలో రోజులో గరిష్ఠంగా 25 వేలు దాటడంలేదని పేర్కొంటున్నారు. వచ్చే మూడేళ్లలో 80 కోట్ల మందికి చేరేందుకు ప్రయత్నిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ జాతీయ స్థాయిలో మాత్రం హైదరాబాద్ మెట్రో రైలు స్థానం పడిపోతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంద.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!