Tuesday, October 8, 2024

YS Jagan: జగన్ మాదిరిగా నేను పథకాలు ఇవ్వలేను – చంద్రబాబు

- Advertisement -

YS Jagan: ఎన్నికల సమయంలో భారీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది కూటమి సర్కార్. ముఖ్యంగా మహిళలను ఆకర్షించేలా పథకాలు మ్యానిఫెస్టోలో రూపొందించారు. ఎన్ని కష్టాలు వచ్చిన ఈ పథకాలు అమలు చేస్తామని ప్రతి ఇంటికి ఓ హామీ పత్రాన్ని సైతం అందజేశారు. దీంతో మెజార్టీ ప్రజలు కూటమి నేతల మాయ మాటలను నమ్మి మోసపోయారు. అందరు అనుకున్నట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ అమలు చేయలేక ప్రభుత్వం సతమతం అవుతోంది

ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500, తల్లికి వందనం, రైతులకు పెట్టుబడి సాయం మొదలగు పథకాలను అమలు చేయడానికి కూటమి సర్కార్ నానా తంటాలు పడుతోంది. వీటిల్లో కొన్ని పథకాలు ఈ ఏడాది ఇవ్వడం లేదని తేల్చి చెప్పడం కూడా జరిగింది. ఇక ఇటీవల చంద్రబాబు సైతం సూపర్ సిక్స్‌ను చూస్తుంటే భయం వేస్తోందని పేర్కొన్నారు. ఖజానాలో డబ్బులేవని ఆయన చెప్పుకొస్తున్నారు. తాజాగా ఏలూరు సభలో కూడా చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. త‌న వ‌ద్ద డ‌బ్బుల్లేవ‌ని, ప్ర‌భుత్వ ఖజానా ఖాళీగా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏం చేయాలో అర్థం కాని ప‌రిస్థితిలో ఉన్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

రూ.10 ల‌క్ష‌ల కోట్ల‌కు వ‌డ్డీ, అస‌లు క‌ట్టాల్సి ఉంద‌న్నారు. వ‌చ్చే ఆదాయం అంతా వ‌డ్డీకే స‌రిపోయేలా గ‌త ప్ర‌భుత్వం చేసింద‌ని విమ‌ర్శించారు. అయితే సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు పథకాలు అమలు చేయలేక ఇలా తప్పించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటికి ఉన్న ఖజానా కన్నా, ఇప్పుడు చంద్రబాబు ఖజానాలోనే ఎక్కువ డబ్బులు ఉన్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. హామీల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు చంద్రబాబును ఎద్దెవా చేస్తున్నారు. చంద్రబాబు మాటలు వింటుంటే పథకాలు అమలు కష్టంగానే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!