Sunday, September 8, 2024

Srujana chowdary : మా ఎమ్మెల్యే ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి సార్..!

- Advertisement -

Srujana chowdary: భారీ వర్షాలు విజయవాడను అతలకుతలం చేశాయి. గత 30 ఏళ్లలో ఎప్పుడు చూడని విధంగా వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. ఆరు రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చాలాచోట్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రజలను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా ఫెయిల్ అయింది. ముఖ్యంగా విజయవాడ ఎమ్మెల్యెవరు కూడా ప్రజలకు అండగా నిలిచింది లేదు. దీంతో ప్రజలు కూటమి ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజ‌య‌వాడ వ‌ర‌ద‌తో అత‌లాకుత‌లం అవుతుంటే స్థానిక వెస్ట్ ఎమ్మెల్యే సుజ‌నాచౌద‌రి క‌నిపించ‌డం మాత్ర కనిపించింది లేదు. వ‌ర‌ద‌లో జ‌నం ఉంటే, సుజ‌నా మాత్రం ఢిల్లీలో సేద‌దీరుతున్నారు. ఒకే ఒక్క‌రోజు మాత్ర‌మే సుజ‌నా చౌద‌రి విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించి బాధితుల‌తో మాట్లాడారు. ఆ త‌ర్వాత ఆయ‌న విజ‌య‌వాడ‌ను విడిచి వెళ్లిపోయారు.

చంద్రబాబు విజయవాడలోనే ఉన్నప్పటికి సుజనా చౌదరి మాత్రం ఢిల్లీకి వెళ్లారు. దీంతో సుజ‌నాచౌద‌రి తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. విజ‌య‌వాడ‌లో విప‌త్తు జ‌రిగినా ప్ర‌జాప్ర‌తినిధిగా సుజ‌నా చౌద‌రి వ‌ర‌ద బాధితులను ప‌ట్టించుకోకుండా, వాళ్ల‌ను అస‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. కేంద్రంలో త‌న పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ, నిధులు తీసుకొచ్చి ఏదైనా మంచి చేయాల‌న్న ఆలోచ‌న సుజ‌నా చౌద‌రిలో లేక‌పోవ‌డదనే మాటలు వినిపిస్తున్నాయి. విజ‌య‌వాడ వెస్ట్ ఎమ్మెల్యేగా సుజ‌నాచౌద‌రి వ‌ర‌ద‌ను పెద్ద స‌మ‌స్య‌గా ప‌రిగ‌ణించ‌లేద‌ని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. దీంతో మా ఎమ్మెల్యే కనిపించడం లేదంటే విజయవాడ వెస్ట్ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!