Sunday, September 8, 2024

ఆ 11 మందిని చంపింది ప్రశాంత్ కిషోరేనట.. అది ఎట్ట లోకేశం

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు పబ్లిసిటీ పట్టుకుంటే.. ఆయన తనయుడు నారా లోకేష్‌కు జగన్ భయం పట్టుకుంది. ఆయన దేని గురించి మాట్లాడిన చివరికి జగన్ వద్దకే ఆగుతారు. తాజాగా రాష్ట్రంలో టీడీపీ సభలకు వచ్చి 11ని చంపింది కూడా జగనేనట. దీనికి ప్లాన్ వేసింది మాత్రం ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ వేశారని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ కారణంగా 11 మంది నిండు ప్రాణాలు కోల్పోయారు. కందుకురులో చంద్రబాబు సభకు వచ్చి 8 మంది మరణించారు. చాలా చిన్న ప్రదేశంలో సభను నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయినప్పటికి కూడా చంద్రబాబు అధికారం దాహం తీరలేదు.

ప్రజలు చనిపోయారని తెలిసినప్పటికి కూడా చంద్రబాబు తన ప్రసంగాన్ని అలాగే కొనసాగించారు. ఈ ఘటన మరువకముందే…తాజాగా గుంటూరులో కూడా ఇలాంటి ఘటనే పునరావృతం అయింది. ప్రీగా చీరలు ఇస్తామని చెప్పి.. తన సభలకు భారీగా మహిళలు వచ్చారని చూపించాలని అనుకున్నారు. కాని అక్కడకు భారీగా మహిళలు చేరుకోవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. దీంతో మరో ముగ్గురు మహిళలు మరణించారు. ఈ ఘటనతో టీడీపీపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తమ రాజకీయ లబ్ది కోసమని చంద్రబాబు అమయాకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు టీడీపీని ఏకిపారేస్తున్నారు. సామాన్య ప్రజలు అయితే అసలు టీడీపీ సభలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వన్ని వేడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు సభలు పెట్టడం వల్ల 11 మంది చనిపోతే.. దానికి కారణం జగన్ అని అంటున్నారు టీడీపీ యువ కిశోరం. ఆ 11 మందిని కూడా పక్కా ప్లాన్‌తోనే చంపేశారని లోకేష్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. వైసీపీ ఎన్నికల వ్యూహాకర్త అయిన ప్రశాంత్ కిషోరే ఈ హత్యలకు కారమని లోకేష్ వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ ప్లాన్‌తో జగన్ దీనిని అమలు చేశారని లోకేష్ తెలిపారు. ఇది విన్న నెటిజన్లు లోకేష్ మాట్లాడిన తీరు మండిపడుతున్నారు. మీ నాన్న సభలకు వచ్చి జనాలు చనిపోతే. దానికి జగన్ కారణం అంటున్నావు..నీకు కనీసం ఇంగితజ్క్షానం అయిన ఉందా అని లోకేష్‌ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నీ తండ్రి అధికార దాహానికి ఎంతమంది బలైయ్యారో తెలుసుకుని మాట్లాడితే మంచిదని నెటిజన్లు నారా లోకేష్‌కు హితవు పలుకుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!