Thursday, October 3, 2024

Ys Jagn :సరికొత్త STYLE and STRATEGY తో దిగిన జగన్ : కూటమి కి వణుకు

- Advertisement -

Ys Jagn :ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం చంద్రబాబు నాయుడు విధానాలపైనా రోజుకో అంశంపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరోసారి సుదీర్ఘ పోస్టు పెట్టారు. ప్రభుత్వ స్కూళ్ళలో సీబీఎస్‌ఈ రద్దు విషయాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ” గవర్నమెంటు స్కూళ్ల రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దుచేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రిగా మీ 14 ఏళ్ల కాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చేసింది. నాడు-నేడు, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ వైపు అడుగులు, టోఫెల్‌, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ పానెల్స్‌, 8వ తరగతి వచ్చే సరికే ట్యాబుల పంపిణీ, విద్యా కానుక, రోజుకో మెనూతో గోరుముద్ద ఇలా పేద పిల్లల తలరాతలను మార్చే చదువులను అందించడానికి వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకువచ్చింది. మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దుచేస్తూ వస్తున్నారు. గవర్నమెంటు స్కూళ్ళు పిల్లలను ప్రైవేటు బాట పట్టించడానికి మీరు, మీ కుమారుడు కుట్రలు చేస్తున్నారు” అంటూ జగన్ ట్వీట్ చేశారు.

” మీ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్కూళ్ళు బాగుండాలి? గవర్నమెంటు స్కూళ్ళు నిర్వీర్యం అయిపోవాలి? మీ ఉద్దేశం అదేగా? తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంత జేబు నుంచి ఎందుకు ఖర్చుచేయాలి? అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు? గవర్నమెంటు స్కూళ్ళలో ఇంగ్లిషు మీడియంను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కోర్టులకు వెళ్లి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజల మరిచిపోలేరు.” అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు చెప్పే ఉపాధ్యాయులు ఎందులోనూ తక్కువ కాదన్న వైఎస్ జగన్ లక్షల మంది పోటీపడే పరీక్షల్లో ఉత్తీర్ణులై చక్కటి శిక్షణ కూడా తీసుకుని ఉంటారన్నారు. ప్రైవేటు స్కూళ్ళలో ఉన్నవారి కంటే గొప్ప చదువులు చదువుకుని విద్యార్థులకు చక్కగా చదువులు చెప్తారని అభిప్రాయపడ్డారు. అలాంటివారిని తక్కువగా చూసే మనస్తత్వాన్ని మార్చుకోవాలని చంద్రబాబుకు సూచించారు. చదువు పేదరికాన్ని నిర్మూలించే ఆయుధమని అభివర్ణించిన జగన్ ప్రభుత్వ స్కూళ్ళను నిర్వీర్యం చేసే తప్పుడు పనులను మానుకోవాలని హితవు పలికారు. లేదంటే చరిత్రహీనులుగా పేద ప్రజల వ్యతిరేకులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.

జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదల సొంత ఇంటి కలను తీర్చడానికి లక్షల మందికి ఇంటిస్థలాలు పంపిణీ చేశారు. జగనన్న కాలనీలుగా అవి రూపుదిద్దుకున్నాయి. పచ్చమీడియాలో వస్తున్న వార్తలను గమనిస్తే ప్రభుత్వం జగనన్న కాలనీల మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. జగనన్న కాలనీలు అన్నీ కూడా నీటి మడుగులు అయిపోయాయని ఇవన్నీ ముంపు ప్రాంతాల్లో ఉన్నాయని ప్రజల్ని భీతావహుల్ని చేసే కథనాలు ప్రచురితం అవుతున్నాయి. ఇందులో ఏదైనా కుట్ర ఉంటే తాము ఊరుకోమని పేద ప్రజలకి అన్యాయం జరిగితే సహించేది లేదని వైయస్సార్‌సీపీ నాయకులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. మొత్తానికి సరికొత్త స్టైల్ మరియు స్ట్రాటజీతో జగన్ మరియు వైయస్సార్‌సీపీ పార్టీ విమర్శలు గుప్పిస్తుందని కూటమి ప్రభుత్వానికి వణుకు మొదలైందని ఆ పార్టీ కార్యకర్తలు అభిప్రాయ పడ్డారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!