Thursday, April 25, 2024

ఆపరేషన్ ‘కాపు’ మొదలుపెట్టిన జగన్… ఇక పవన్‌కు చుక్కలేనా..?

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు వైసీపీ అధినేత జగన్. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించాలని కోరుకుంటుంది. దీనిలో భాగంగానే ఆ పార్టీ 175 సీట్లలో విజయం సాధించాలనే గోల్ పెట్టుకుంది. అయితే 175 సీట్లలో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ప్రత్యర్థులకు ఎక్కడ కూడా చోటు లేకుండా ఎన్నికల వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. అయితే 2019 ఎన్నికల నాటి పరిస్థుతులు ఇప్పుడు ఉన్నాయా అంటే .. లేదనే చెప్పాలి. 2019 ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్‌కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ముఖ్యంగా ఏపీలో అధికారంలోకి రావాలంటే కాపుల ఓట్లు చాలా కీలమనే చెప్పాలి. గత ఎన్నికల్లో కాపులు 80 శాతం వైసీపీకే ఓటు వేశారు. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పదే పదే పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు వేస్తారా అంటే చెప్పాలేని పరిస్థితి నెలకొంది. మెజార్టీ కాపులు జనసేనకు మొగ్గుచూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జగన్ తనలోని రాజకీయకోణాన్ని బయటపెట్టారు. కాపులు ఎక్కడ కూడా చేయి జారకుండా చేయలని చూస్తున్నారాయన. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్ర చేతిలోకి రావడం ఇప్పుడు జగన్‌కు పెద్ద వరంగా మారింది.

దీని ద్వారా కాపులకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మెజార్టీ కాపులు వైసీపీ వైపు వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి.కాపుల అధిక సీట్లు ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కాపులకు తన మంత్రివర్గంలో చోటు ఇవ్వడంతో పాటు ఆ సామాజిక వర్గానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కాపులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న రిజర్వేషన్లు కల్పించి ..వారి ఓటు బ్యాంకును క్యాష్ చేసుకోవాలని వైసీపీ అధినేత ఆలోచనగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా కాపులు వైసీపీకి అండగా ఉండేలా జగన్ ప్రణళికలు రచిస్తున్నారు. తద్వారా అటు టీడీపీతో పాటు, ఇటు జనసేనకు కూడా ఒకేసారి చెక్ పెట్టవచ్చని జగన్ ప్లాన్. మరి వైసీపీ అధినేత వ్యూహాలు ఎంతమెర ఫలిస్తాయో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!