Friday, October 4, 2024

YS Jagan: ప్రతిభకే పట్టం కట్టిన జగన్…వైసీపీ నుంచి వారు అవుట్

- Advertisement -

YS Jagan: జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ప్రక్షాళన చేపట్టి పార్టీ నాయకులకు షాకిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోవడంతో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఎవరూ ఊహించని వారికి పదవులు కేటాయించారు. పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి పదవులు కేటాయిస్తున్నారు. దీనిలో భాగంగానే జగన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. జిల్లాల వారీగా పార్టీలో నియామకాలు కొనసాగిస్తున్నారు. జిల్లా అధ్యక్షులతో పాటుగా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ఖరారు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఎన్నికల ముందు పలువురి నియోజకవర్గాలను మార్పు చేశారు. ఆ ప్రయోగం విఫలమైంది. దీంతో, ఇప్పుడు చర్యలు మొదలు పెట్టారు. నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల సమన్వయకర్తలను ఖరారు చేశారు. జగన్ తాజాగా మూడు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షులను..నియోజకవర్గాల సమన్వయకర్తలను ఖరారు చేశారు. జిల్లాల్లో పార్టీ పరిస్థితి పై ఆరా తీసారు. ప్రభుత్వం పైన తక్కువ సమయంలోనే వ్యతిరేకత కనిపిస్తోందని పార్టీ నేతలు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రయత్నం జరగటం లేదన్నారు.

ఇదే సమయంలో పార్టీ కేడర్ కు అండగా నిలవాలని నేతలకు జగన్ సూచించారు. ఇప్పటికే పలు జిల్లాలకు జగన్ అధ్యక్షులను నియమించారు. తాజాగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాణి గోవర్ధనరెడ్డి ,పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ,పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ముదునూరి ప్రసాదరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా నియమించడం జరిగింది.

నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు.నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్‌రెడ్డి ని ఎంపిక చేసారు. గతంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పని చేసి..ఆ తరువాత ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసిన ఓడిన అనిల్ కుమార్ యాదవ్ ను జగన్ తాజాగా నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా నియమించారు. ఇలా పార్టీలో మొదటి నుంచి కష్టపడిన వారికి పదవులు కేటాయిస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!