Saturday, April 20, 2024

వైవీసుబ్బారెడ్డికి జగన్ బిగ్‌ షాక్ .. టీటీడీ ఛైర్మన్ బాధ్యతల నుంచి తొలగింపు..?

- Advertisement -

బాబాయ్ వైవీసుబ్బారెడ్డికి సీఎం జగన్ షాక్ ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైవీసుబ్బారెడ్డి ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో మరోవ్యక్తికి ఆ పదవిని ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…వైవీసుబ్బారెడ్డి ఈ పేరు పెద్దగా పరిచియం అక్కర్లేదు. వైఎస్ఆర్ మరణించిన తరువాత అనుహ్యంగా ఏపీ రాజకీయాల్లోకి వైవీసుబ్బారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. 2014 ఒంగొలు ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారాయన. తరువాత జరిగిన రాజకీయ పరిణమాలతో 2019 ఎన్నికల్లో వైవీసుబ్బారెడ్డికి జగన్ టికెట్ కేటాయించలేదు. పార్టీ అధికారంలోకి రావడంతో వైవీసుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే తాజాగా వైవీసుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ నుంచి తప్పించాలని జగన్ చూస్తున్నారని తెలుస్తోంది. వైవీసుబ్బారెడ్డి స్థానంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని కాని వైసీపీ ఏర్పాటు నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్న బీసీ నేత జంగా కృష్ణ‌మూర్తికి కాని టీటీడీ ఛైర్మన్‌గా నియమించే అవకాశముందని సమాచారం అందుతుంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందునే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్రపై మంచి పట్టుంది. ఆయన సేవలన రాజకీయాంగా వినియోగించుకునేందుకే జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఎన్నికలలో మళ్లీ గెలిచేందుకు జగన్ వరసగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్ గా తప్పించి ఉత్తరాంధ్ర జిల్లాల పూర్తి బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సంక్రాంతి తర్వాత కొత్త పాలకమండలిని నియమించే అవకాశాలున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!