Tuesday, October 8, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలకు జగన్ బంపర్ ఆఫర్..పచ్చ బ్యాచ్‌కు మూడిందే..!

- Advertisement -

గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా అధికార వైసీపీ అతి దారుణంగా ఓడిపోయింది. కచ్చింతంగా గెలుస్తామని లెక్కల నుంచి, ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని స్థితికి వైసీపీ చేరుకుంది. ఇంతటి దారుణ ఓటమిని పార్టీ నాయకులే కాదు , కార్యకర్తలు సైతం ఊహించలేకపోయారు. పార్టీ ఓడిపోయవడంతో నాయకులు సైతం వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలతో పాటు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైసీపీకి రాజీనామా చేశారు. సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి వారు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

దీంతో జగన్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో కష్టపడిన వారికి కీలక పదవులు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగానే యాంకర్ శ్యామలకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శ్యామలను అధికార ప్రతినిధిగా నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు జగన్. గత ఎన్నికల్లో యాంకర్ శ్యామల వైసీపీ తరుఫున విసృత ప్రచారం చేశారు. కీలక నియోజకవర్గాల్లో ఆమె పార్టీ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆమె టీడీపీ, జనసేన పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.

సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కల్యాణ్ జనసేన , టీడీపీకి అండగా నిలిచిన తరుణంలో శ్యామల ఒక్కరే వైసీపీకి మద్దతుగా నిలబడ్డారు. వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో ఆమెపై టీడీపీ, జనసేన శ్రేణులు తీవ్ర విమర్శలు చేసినప్పటికి వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగారు.అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో శ్యామల సైతం సైలెంట్ అయ్యారు. ఇటువంటి తరుణంలో శ్యామలకు ఉన్నత పదవి అప్పగిస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.పార్టీ ఓడిపోవడంతో , వైసీపీలో మార్పులు, చేర్పులకు జగన్ శ్రీకారం చూట్టారు.

దీనిలో భాగంగానే పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించడం జరిగింది.తాజాగా పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించింది. మాజీ మంత్రి ఆర్ కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేసింది. ఇదే జాబితాలో ప్రముఖ యాంకర్ శ్యామలకు కూడా చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది.పార్టీపరంగా పని చేస్తున్నప్పటికి ఎలాంటి హోదా లేకుండానే ఆమె గత ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డారు. దీన్ని గుర్తించిన జగన్ శ్యామలను పార్టీకి అధికార ప్రతినిధిగా నియమించారు. మరి తనపై వైసీపీ ఉంచిన బాధ్యతలను శ్యామల ఎలా నిలెబెట్టుకుంటారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!