Tuesday, October 8, 2024

Jagan: జగన్ అభిమానుల దెబ్బకి శత్రువులు పరార్ .. జనం మధ్యలో ఏం జరిగిందో చూడండి

- Advertisement -

Jagan: ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయినా సరే జగన్ మోహన్ రెడ్డి పబ్లిక్ లోకి వస్తే చాలు ప్రజలు ఆయనకి నీరాజనం పలుకుతున్నారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిన్న కూడా తాడేపల్లిలో ఆయన ఇంటి దగ్గర అడుగు బయట పెట్టిన దగ్గర నుంచి గుంటూరు జైలు వరకు అడుగడుగునా ఆయనకి తోడుగా ర్యాలీగా వెళ్ళింది యువత. ప్రజలు ఆయనకి హారతి పడుతూ జేజేలు కొట్టారు. గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల తాము ఎంతగానో లాభం పొందినట్లు తమ బ్రతుకులు చాలా మెరుగైనట్లు ప్రజలు జగన్ తో చెప్పుకున్నారు. ప్రజలే బౌన్సర్ లలా మారి ఆయనకి దారి పొడుగునా రక్షణ కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆయనకి పూర్తిగా సెక్యూరిటీ తగ్గించిందని మళ్ళీ సెక్యూరిటీ పెంచమని ఆయన హై కోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన విచారణ ఇంకా జరుగుతోంది. ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గిస్తే ఏం తామే సెక్యూరిటీగా ఉంటామని వారంతా జగన్ కి రక్షణ కవచంలా నిలిచారు. జగన్ అభిమానులు ఆయన సానుభూతి పరులు భారీగా తరలి వచ్చారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మరియు కార్యకర్తల పైన వరుస దాడులు దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ కక్ష పూరిత రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి కేసులో అవినాష్ తో పాటు, అతని ముఖ్య అనుచరులు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అవినాశ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత‌, బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగాం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో వీరికి హైకోర్టు బెయిలు నిరాకరించిన సంగతి తెలిసిందే. అందుకే వీరిని పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిన్న గుంటూరు జైలుకు వెళ్ళారు. ఓటమికి కుంగిపోయి తల దాచుకోకుండా జగన్ తన అవసరం ఎక్కడ ఉన్నా సరే తనని నమ్ముకున్న ప్రజలకి, నాయకులకి అండగా ఉన్నాననే భరోసా ఇవ్వడానికి ఆయన శ్రమిస్తున్నారు.

రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడే జగన్ మోహన్ రెడ్డి ని శాశ్వతంగా మట్టిలో కప్పేయాలని పైన కాంక్రీట్ వేయాలని దారుణంగా మాట్లాడిన నేపధ్యంలో ఇలాంటి సంఘటన చూసి ఎవరికైనా భయం రావాల్సిందే. జగన్ మీద ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ఎంతటి శత్రువులైనా సరే పరారీ అవ్వాల్సిందే అని వైసీపీ వర్గాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న మాటలు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!