Friday, October 4, 2024

Ys jagan-Chandrababu : జగన్ పాపాలే… శాపాలంటున్న బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పబ్లిక్

- Advertisement -


Ys jagan-Chandrababu :ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బాబు పరిష్కార మార్గాలను పక్కన పెట్టి మళ్లీ జనానికి జగన్ ప్రస్తావనను గుర్తు చేస్తున్నారు. వరద ప్రాంతాల్లో 10 రోజులుగా పర్యటిస్తున్న బాబు ఏమాత్రం భరోసా కల్పించలేదు. వరద బాధితులకు ఏం చేస్తారో చెప్పాకుండా జగన్ పై విమర్శలు మాత్రమే చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన పాపాలే.. శాపాలయ్యాయని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. జగన్ పై బాబు విమర్శలు చేయడంతో విజయవాడ పబ్లిక్ మండి పడుతున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వ ప్రస్తావన మాట్లాడే సమయమా..? పరిష్కారం వచ్చి అంతా సర్దుకున్నాక విమర్శలు చేసుకోవాలని బాధితులు అంటున్నారు. ప్రస్తుతం సమస్య నుంచి బయటకు వచ్చేలా ప్రయత్నాం చేయాలని వేడుకుంటున్నారు. బాబు వస్తున్నప్పుడల్లా ఏదో చేస్తారు, ఇస్తారనుకుంటే మళ్లీ విమవర్శలనే రిపీట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి కూటమి సర్కార్ వచ్చాక మొదటి ప్రకృతి వైఫరిత్యం ఇది. పది రోజులుగా మగ్గుతున్నా బాడా నేతలు మోదీ, బాబు, పవన్ ల నుంచి ఇంత వరకు ఎలాంటి ధైర్యం రాలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొక్కుబడిగా టూర్ లు చేసి వెళ్లిపోతున్నారని బాధితులు వాపోతున్నారు.

జగన్ మానవత్వంతో బాధితుల దగ్గరకు వచ్చి దైర్యం చెప్పడం సంతోషంగా ఉంది. కానీ కూటమి నేతలు వచ్చి పరామర్శిస్తే నమ్మకం కలగడం లేదని బాధితులు ముక్తకంఠంగా చెబుతున్నారు. అధికారంలో ఉండి కూటమి నేతలు డబ్బులు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. బాధ్యతగా చేయాల్సిన పనులు పక్కన పెట్టి ప్రతి విమర్శలు చేసుకోవడం సరైనది కాదంటున్నారు. బాబు వరదల సమయంలో విమర్శలు చేస్తే వినే ఓపిక మాకు లేదని పబ్లిక్ అంటున్నారు. బాధితుల దగ్గరకు జగన్ వచ్చినప్పుడే బాబు వస్తున్నారు, పవన్ స్పందిస్తున్నారు. మిగతా సమయాల్లో బాధితులను పట్టించుకునే నాథుడే లేడని బాధపడుతున్నారు. బుడమేరును కబ్జా చేశారు కాబట్టే వరదలు వచ్చాయని జోష్యం చెబుతున్నారు. మళ్లీ ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్లిపోతున్నారు. వాళ్ల సమన్వయ లోపాన్ని ప్రశ్నిస్తే తప్పించుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అందరికీ ఆహారం, పాలు, పండ్లు పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు ఆహార పొట్లాలు ఎంతమందికి అందుతున్నాయో వారికి తెలుస్తుందా…? అని ప్రశ్నిస్తున్నారు. చాలా మందికి ఫుడ్ లేక అవస్థలు పడుతున్నారని చెప్పుకొస్తున్నారు. బాధితులను బెగ్గర్స్ లా చూస్తున్నారని మండిపడుతున్నారు. ఫుడ్, పండ్లు, పాలు ఇస్తే సమస్య తీరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సరుకుల కిట్ పంపిణీ అందక పోతే డిమాండ్ చేసి తీసుకోవాలంటున్నారు… అంటే పరోక్షంగా అడుక్కోండని చెప్పడమే కాదా.. అని పబ్లిక్ ని ప్పులు చెరుగుతున్నారు. సరుకుల కిట్ పంపిణీ ఎలా చేయాలో వారికి తెలియదా, బాధితులెవరో గుర్తించరా…? సాయం కోసం సాటి వారికి చేతులు చాసుకున్న పరిస్థితి దారణమంటున్నారు. ఇంకా కూటమిలో భాగంగా ఉన్న కేంద్రాన్ని కూడా వెనుకేసుకొస్తున్నారు. కేంద్రం ఇస్తే తప్ప సాయం చేయలేమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్న బాబు కేంద్రానికి మొదటి విడతగా రూ. 6వేల కోట్లకు పైగా అడిగామంటూ చెప్పుకుంటున్నారు. పరిస్థితి నుంచి బయట పడే మార్గం రాష్ట్ర ప్రభుత్వం చూపించడం లేదు. కేంద్రం నుంచి పెద్దలను పిలిపించి పరిస్థితిని వివరిండం లేదు. కూటమి నేతలు ఎవరికి వారే ప్రాధాన్యతను పెంచుకునే పనిలో ఉంటున్నారు. వరదలకు మందు సమన్వయం లోపం… వరదలు వచ్చిన తర్వాత కూడా కూటమినేతల్లో సమన్వయ లోపమే కనబడుతోందని పబ్లిక్ రెచ్చిపోతున్నారు.
—————– హరీష్ —————————

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!