Sunday, October 13, 2024

Jagan:జన్మలో మళ్ళీ ఎవరో తన మతం పేరు ఎత్తకుండా జగన్ స్ట్రాంగ్ ఆన్సర్

- Advertisement -

Jagan: తిరుమల దర్శనానికి వెళ్లేందుకు తాను సిద్దమైతే మతం పేరు చెప్పి అడ్డుకుంటారా అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా తన కుల, మతాలను ప్రస్తావిస్తూ తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవడాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో తన మతమేంటో, కులమేంటో ఎవరికీ తెలియదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కులం, మతం ఎవరికీ తెలియదా అని అడిగారు. తండ్రి వైఎస్ కూడా గతంలో పలుమార్లు తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారని, తాను కూడా అలాగే చేశానన్నారు. తాను గతంలో పాదయాత్ర తర్వాత కాలి నడకన తిరుమలకు వెళ్లానని గుర్తుచేశారు. గతంలో చంద్రబాబు కళ్ల ముందే తాను తిరుమల కొండెక్కానన్నారు. ఐదేళ్ల పాటు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు సమర్పించానని గుర్తుచేశారు. పది, పదకొండు సార్లు తాను తిరుమల వెళ్లాక ఇప్పుడు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆక్షేపించారు. తిరుమలకు నా మతం కారణంగా వెళ్లకూడదని చంద్రబాబు చెప్తున్నారని జగన్ ఆక్షేపించారు. తాను ఇంట్లో నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని, బయటకు పోతే హిందూ సంప్రదాయాలని, ఇస్లాంను, సిక్కిజాన్ని అనుసరిస్తానని, గౌరవిస్తానని తెలిపారు. తన మతం మానవత్వం అన్నారు. భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం భారత్ సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్యమన్నారు. ఇందులో సెక్యులర్ అనే పదానికి అర్దమేంటో తెలుసా అన్నారు. గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతమని అడుగుతున్నారని జగన్ ఆక్షేపించారు. సీఎంగా చేసిన తనలాంటి వ్యక్తి పరిస్ధితే ఇలా ఉంటే దళితులు గుడికి వెళ్లే పరిస్ధితి ఉందా అని అడిగారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యం అన్నారు. హిందుత్వానికి ప్రతినిధులుగా చెప్పుకునే బీజేపీ నేతలు.. చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దిగజారుస్తుంటే ఎందుకు ఆయన్ను మందలించలేకపోతున్నారని, ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!