Saturday, April 20, 2024

కరణం బలరాం బ్యాక్ టూ టీడీపీ.. జగన్నే మోసం చేస్తున్న వైనం

- Advertisement -

జగన్‌కు కరణం బలరాం షాక్…తిరిగి టీడీపీలోకి ..?

2019 ఎన్నికల్లో రాష్ట్రం అంతటా వైసీపీ గాలి వీచినప్పటికి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ కూడా సత్తా చాటింది. పర్చూరు, అద్దంకి, చీరాల వంటి చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఎన్నికలు తరువాత జరిగిన పరిణమాలతో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీ నుంచి బయటకు వచ్చి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కరణం బలరాం పేరుకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉనప్పటికి కూడా ఆయన తనయుడు కరణం వెంకటేష్ మాత్రం.. ఆఫిషియల్‌గా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..కరణం బలరాం తిరిగి టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తిరిగి తన పాత గూటికి చేరుకుంటున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన తిరిగి టీడీపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు విశ్వసనీయసమాచారం.

కరణం బలరాం వైసీపీలో ఉండలేకపోతున్నారని తెలుస్తోంది. తన సామాజికవర్గం పార్టీ అయిన టీడీపీ వైపు ఆయన చూస్తున్నారని తెలుస్తోంది. కరణం బలరాం వైసీపీలో చేరి ఇన్నాళ్లు అయినప్పటికి కూడా చంద్రబాబు మీద ఒక్క విమర్శ కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. సహజంగానే కరణం బలరాం దూకుడుగా ఉండే నేత. ఆయన టీడీపీలో ఉన్న సమయంలో వైసీపీ అధినేత జగన్ మీద విమర్శల దాడి చేసేవారు. కాని గతంలో ఉన్న దూకుడు ఇప్పుడు ఆయనలో కనిపించడం లేదు. పైగా చంద్రబాబును విమర్శించడానికి కరణం బలరాం సిద్దంగా లేరని సమాచారం అందుతుంది. దీనికి తోడు ఆయన టీడీపీ నేతలతో టచ్‌లో కూడా ఉన్నారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కరణం బలరాం తన ఆస్తులను కాపాడుకోవాడానికే వైసీపీలో చేరారని..2024 ఎన్నికల నాటికి కరణం బలరాం టీడీపీలో చేరడం ఖాయం అని చీరాల నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతుంది.

కరణం బలరాంను వైసీపీలోకి తీసుకువచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ప్రెస్ మీట్ పెట్టి తనపై వస్తున్న ఆరోపణలను ఖండించాలని కరణం బలరాంకు బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించనప్పటికి కూడా ..కరణం బలరాం మీడియా ముందుకు రాకపోవడం విశేషం. దీంతో కరణం బలరాం ఖచ్చితంగా టీడీపీలో చేరతారని ఊహాగానాలు ఊపుందుకున్నాయి. తాను వైసీపీలో ఉంటే.. అటు ఆమాంచి,ఇటు గొట్టిపాటి ఇరు వర్గాల కూడా తనని ఓడించే ప్రయత్నం చేస్తారని..అదే టీడీపీలో ఉంటే తనని ఎవరు ఏం చేయలేరనే నిర్ణయానికి కరణం బలరాం వచ్చినట్లుగా తెలుస్తుంది. జరుగుతున్న ఘటనలను అన్ని కూడా నిశితంగా పరిశీలిస్తున్న కరణం బలరాం.. తాను టీడీపీలో ఉంటేనే బెస్ట్ అని భావిస్తున్నారట. అతి త్వరలోనే ఆయన తన పాత గూటికి చేరుకునే అవకాశం ఉంది. మరి దీనిపై అధికార వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!