Tuesday, September 10, 2024

విజయవాడలో కేసీఆర్ భారీ బహిరంగ సభ.. జగన్ అనుమతిస్తారా..?

- Advertisement -

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బీఆర్ఎస్‌ను ప్రకటించారు కేసీఆర్. తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ నామకరణం చేస్తూ.. తీర్మానం చేశారు. జాతీయ నాయకుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీని స్థాపించారాయన. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్దం అవుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో కూడా పోటీ చేయడానికి కేసీఆర్ సిద్దం అవుతున్నట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని తెలుస్తుంది.

ముఖ్యంగా ఏపీలో కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లుగా సమాచారం అందుతుంది. ఆయన త్వరలోనే ఏపీలో ప్రచారం చేయడానికి కూడా సన్నద్దం అవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఆయన త్వరలోనే విజయవాడలో భారీ బహిరంగ సభ పెట్టడానికి ప్రణళికలు రచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటన సమయంలో ఏపీలో ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్‌ పెట్టబోయే జాతీయ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. విజయవాడలోని వారధి ప్రాంతంలో హోర్డింగులు ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీలో సంక్రాంతికి భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఏపీలో కేసీఆర్ పార్టీకి ఆదరణ ఉంటోందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

కొందరు వ్యాపారస్తులు..ఏపీలో రాజకీయాల్లో కేసీఆర్‌కు సహకారం అందించేందుకు సిద్దమవుతున్నారని టాక్ నడుస్తుంది.ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నాయకులతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో జనవరి నెలలో భారీ సభకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కేసీఆర్ బహిరంగ సభకు సీఎం జగన్ అనుమతిస్తారా అనేది ఇక్కడ చర్చనియాంశంగా మారింది. కేసీఆర్, జగన్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి. ఇటువంటి తరుణంలో జగన్‌ను కాదని.. కేసీఆర్ ఏపీలో సమావేశం పెడతారా అనేది కూడా ఇక్కడ అసలు ప్రశ్న. అయితే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రభావం పెద్దగా ఉండబోదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఏపీపై కేసీఆర్ ప్రత్యేక దృష్టిని సారించినట్లుగా సమాచారం అందుతుంది. ఏపీలో టీడీపీతో కాని.. లేకపోతే పవన్ కల్యాణ్ జనసేన పార్టీలతో కాని పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏపీలో ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!