Thursday, April 25, 2024

తనకు ఇష్టమైన లీడర్ ఎవరో చేప్పేసిన మెగాస్టార్.. అభిమానులు ఎటువైపో

- Advertisement -

నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదంటూ ఇటీవల సంచలనం సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి. 30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఓ వెలుగు వెలిగారు మెగాస్టార్ చిరంజీవి.అభిమానుల ఇచ్చిన పిలుపుతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారాయన. 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఆయన రెండుచోట్ల పోటీ చేసి ఒక చోట మాత్రమే విజయం సాధించారు. అప్పటికే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితం అయింది.

కాని తరువాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం కూడా చేశారాయన. తద్వారా కేంద్రమంత్రి కూడా కాగలిగారు. 2014 ఎన్నికల నాటికి ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
అయినప్పటికి కూడా రాజకీయాలు మాత్రం నిత్యం ఆయన్ను వెంటాడుతునే ఉన్నాయి. తన తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేప పార్టీ పెట్టడంతో చిరంజీవి మీద ఒత్తిడి మరింత ఎక్కువైంది. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో.. వైసీపీకి తన మద్దతు ప్రకటించారు చిరంజీవి. జగన్ సీఎం అయిన నాటి నుంచి కూడా ఆయనతో చిరంజీవి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి తన మద్దతు తెలుపుతున్నారు చిరంజీవి. కాని ఇటీవల వచ్చే ఎన్నికల నాటికి తన తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి మద్దతు తెలుపుతానేమో అని చెప్పకనే చెప్పడం జరిగింది.

ఇదిలా ఉండగా..ఇప్పుడు తనకు ఇష్టమైన రాజకీయ నేతల పేర్లు స్వయంగా వెల్లడించటంతో, మరో సారి మెగా పొలిటికల్ డిబేట్ మొదలైంది. తాజాగా తన సోషల్ మీడియాలో అభిమానులతో ఇంట్రాక్ట్ అయిన చిరంజీవి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మీకు ఇష్టమైన పొలిటిషియన్ ఎవరు అని అడగ్గా…నేటితరంలో వారిలో చెప్పడం కాస్తా కష్టమే అని చెప్పిన చిరంజీవి… కాని పాతతరంలో మాత్రం తనకు ఇద్దరు నాయకులు అంటే బాగా ఇష్టమని చెప్పుకొచ్చారు. తనకు తెలిసినంత వరకు కూడా లాల్ బహదుర్ శాస్త్రీగారు అంటే తనకు బాగా ఇష్టమైన నాయకుడని..ఆయన సింప్లిసిటీ, తన జీవితాన్ని దేశ శ్రేయస్సు కోసం అర్పించిన మహానుభావుడని కీర్తించారు. ఇదే సమయంలో అటల్ బిహారీ వాజపేయి గారిని అమీతంగా ఇష్టపడతానని చిరంజీవి తెలిపారు. ఆ ఇద్దరిని తాను గొప్ప నాయకులగా కీర్తిస్తానని లైవ్‌లో మెగాస్టార్ చిరంజీవి చెప్పడం జరిగింది. మరి దీనిపై మెగా అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!