Friday, October 4, 2024

AP Politics: త్వరలోనే ఏపీ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు..!

- Advertisement -

AP Politics: దేశంలో ఉత్కంఠ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు కేంద్రం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం మధ్యంతర ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు దాదాపు కనబడుతున్నాయి. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనపై సరైన శ్రద్ధ వహించకపోవడం, రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు తలెత్తుతున్న తరుణంలో ఏపీలో జమిలి ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. ఇది నిజం అని నిరూపించేలా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికల వాతావరణం కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాగా, వన్ నేషన్- వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను ఇప్పటికే కేంద్రానికి అందజేసింది. దీనిపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు సంబంధించి అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం అప్రమత్తంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు హడావిడి రాజకీయాలు చేయడం, రాష్ట్రంలో నెలకొన్న దుర్భర పరిస్థితులను ప్రతిపక్షమైన వైసీపీ మీదికి నెట్టివేయడం, ఏదైనా తప్పు జరిగితే తేలిగ్గా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని నిందించడం, ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించలేకపోవడం లాంటి చర్యలతో ఏపీలో మధ్యంతర ఎన్నికల గురించి ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు మాత్రం వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో వైసీపీ విజయ దుందుభి మోగించి మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!