Friday, April 19, 2024

అప్పుడలా..ఇప్పుడిలా.. వైసీపీ ఎంపీకి నెటిజన్లు ఫిదా

- Advertisement -

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పోలీస్ శాఖలో పని చేసిన దగ్గర నుంచి కూడా వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వార్నింగ్ గోరంట్ల మాధవ్ విధానం ఇప్పటికి అందరికి గుర్తే ఉంటుంది. గోరంట్ల మాధవ్‌లోని తెగువును చూసిన తరువాతే జగన్ వైసీపీలోకి ఆహ్వానించి హిందుపురం ఎంపీగా టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఎంపీగా గెలిచిన్పపటికి కూడా గోరంట్ల మాధవ్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అమ్మాయితో న్యూడ్ కాల్ వ్యవహరం.. ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. ఆయనకు సంబంధించిన న్యూడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.

ఓ మహిళతో గోరంట్ల మాధవ్ అసభ్యరీతిలో మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ప్రతిపక్షాలు అన్ని కూడా ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వన్ని టార్గెట్ చేశాయి. అమ్మాయిల మానాలతో ప్రజా ప్రతినిధులు ఆడుకుంటున్నారని జగన్ సర్కార్ మీద ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. అయితే అది ఫేక్ వీడియో అని ..ఈ వీడియోకు తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు గోరంట్ల. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అధికార వైసీపీకి గోరంట్ల న్యూడ్ వీడియో చాలా చెడ్డ పేరు తీసుకువచ్చింది. అసలు ఈవీడియోలో నిజమైనదా కాదా అనే దానిపై విచారణ చేపట్టిన పోలీసులు .. ఇది ఒరిజినల్ వీడియో కాదని తేల్చారు. దీంతో చాలా ఈజీగానే గోరంట్ల మాధవ్ ఈ వివాదం నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన చేసిన పనితో మరోసారి వార్తల్లో నిలిచారు.

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు జిల్లా ప్రజలు భారీ వర్షాలతో అతలకుతలం అవుతున్నారు. పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో జలమయమయ్యాయి . మంగళవారం రాత్రి నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అనంతపురం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వారిని ఎంపీ గోరంట్ల మాధవ్ స్వయంగా రక్షించారు. వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న బాలున్ని మోసుకుంటూ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు ఎంపీ గోరంట్ల మాధవ్. ఆయన ఓ పిల్లాడిని తన భుజాల మీద మోసుకుంటూ తీసుకుని వచ్చిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అప్పుడలా..ఇప్పుడిలా అంటూ సోషల్ మీడియాలో గోరంట్ల మాధవ్‌కు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. మరి దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!