నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అల్లూ వారి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే టాక్ షో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో తెలుగులో ఒక ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తోంది. బాలయ్యకు ఉన్న క్రేజ్, ఆయన జోవియల్‌గా మాట్లాడే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ సీజన్ ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యింది. ఇటీవలే సెకండ్ సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ షోకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా రావడం ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది.
సినిమాల్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన బాలకృష్ణ.. రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు నాయుడును ప్రశ్నలు అడగటం, వాటికి బాబు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఆన్సర్లు చెప్పడంతో ఈ షో గ్రాండ్ హిట్ అయ్యింది. అయితే, ఈ షోపైన విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సంఘటనపైన తమ తప్పేమీ లేదని నిరూపించుకోవడానికే ఈ షోను చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఉపయోగించుకున్నట్లు ప్రేక్షకులు ఈజీగానే గ్రహించేశారు.
పైగా చంద్రబాబు, బాలయ్య బావబామ్మర్దులే కావడం, అందులోనే ఒకే పార్టీ కావడంతో ఇతర పార్టీల వారికి ఈ షో అంతగా నచ్చలేదు. అంతేకాదు, ఈ షోని నిర్వహించిన ఆహా ఓటీటీ పట్ల కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. కేవలం నందమూరి, నారా కుటుంబాలను పొగుడుకోవడానికి, ఎన్టీఆర్‌కు తాము వెన్నుపోటు పడవలేదని నిరూపించుకోవడానికే ఈ షోకి చంద్రబాబును పిలిచారనే విమర్శలు బాగా వచ్చాయి. అన్నింటికంటే మించి నారా లోకేష్‌ను కూడా ఈ షోకి పిలవడంతో పూర్తిగా షో గాడి తప్పింది. అంతా వారి ఫ్యామిలీ షోగా, స్వంత డప్పు కొట్టుకున్నట్లుగా మారింది.
ఈ విషయాన్ని అల్లూ వారి ఆహా కూడా గ్రహించినట్లుంది. అందుకే చంద్రబాబు షోతో వచ్చిన నెగిటివిటీని తగ్గించుకోవాలని చూస్తోంది. చంద్రబాబు షో తర్వాత హీరోలు విశ్వక్ సేన్, డీజే టిల్లు ఫేమ్ జొన్నలగడ్డ సిద్దుని బాలయ్య పిలిచారు. కానీ, ఇదీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో మళ్లీ పాలిటిక్స్ నుంచే ఎవరైనా ఫైర్ బ్రాండ్‌ని పిలవాలని ఆహా వారు భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎక్కువగా మంత్రి, వైసీపీ కీలక నాయకురాలు రోజా పేరు వినిపిస్తోంది.
చంద్రబాబును ఈ షోకి పిలవడం ద్వారా ఆహా ప్లాట్‌ఫార్మ్ వైసీపీ మద్దతుదారులకు దూరమైంది. ఇప్పుడు రోజాను ఈ షోకి పిలవడం ద్వారా తమ ప్లాట్‌ఫార్మ్ న్యూట్రల్ అని నిరూపించుకునేందుకు ఆహా ప్రయత్నిస్తోందని సమాచారం. పైగా బాలయ్య, రోజా ఇద్దరూ సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. ఇద్దరూ ఏపీలో కీలక నేతలుగా ఉన్నారు. ఒకరు వైసీపీ కీలక నాయకురాలు అయితే, మరొకరు టీడీపీ కీలక నేత. దీంతో బాలయ్య షోకి కనుక రోజా హాజరైతే అది రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారే ఛాన్స్ ఉంటుంది.
షోకి మంచి హైప్ క్రియేట్ అవుతుంది. పైగా తాము ఏ పార్టీకీ అనుకూలం కాదనే మెసేజ్‌ను ఆహా వారు ఇచ్చినట్లవుతుంది. బాలయ్య కూడా రోజాను పిలవడానికి ఆసక్తిగానే ఉన్నారని తెలుస్తోంది. కళారంగానికి రాజకీయానికి మధ్య ఉండే స్పష్టమైన గీత రోజాకు బాగానే తెలుసు. తన ప్రత్యర్థి పార్టీ నేత అయినా కూడా నాగబాబుతో కలిసి ఆమె జబర్దస్త్ షోకి వచ్చేవారు. కాబట్టి, బాలయ్య షోకి పిలిస్తే రోజా కాదనరు. కాబట్టి, త్వరలోనే బాలయ్య ముందు గెస్ట్ సీట్‌లో రోజా కూర్చోవడం దాదాపు ఖాయమే అని తెలుస్తోంది.