Saturday, October 5, 2024

Chandrababu: చంద్రబాబు అరెస్టుకు ఏడాది.. ఆ సానుభూతి వల్లే వైసీపీకి ఇలాంటి పరిస్థితి?

- Advertisement -

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాల ఆరోపణల కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి సరిగ్గా నేటికి ఏడాది. ఈ మేరకు ఏపీ సీఐడీ కేసుల వల్ల చంద్రబాబు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అవినీతిపరుడు అని ప్రూవ్ చేయడానికి, ఉన్న నిజాలు రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చెప్పడానికి పెద్దగా సమయం పట్టలేదు. అందుకే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గతేడాది ఇదే రోజున చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు కేటాయించిన నిధుల వినియోగంలో దుర్వినియోగం జరిగిందని సీఐడీ చంద్రబాబుపై కేసు నమోదు అరెస్ట్ చేసింది. గతేడాది సెప్టెంబర్ 9న చంద్రబాబును రూ.371 కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేయగా.. తర్వాత యాభై మూడు రోజుల జైలు జీవితం అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. ఇది అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.

ఇదంతా గతం కాగా, ఇప్పుడు ఇదే వైసీపీకి మాయని మచ్చలా మారిందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. భారీ అవినీతికి పాల్పడిన ఒక రాజకీయ నాయకుడిని, అందులోనూ గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న ఒక పార్టీ అధినేత తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ఎందుకు ఉండదని, తప్పు చేస్తే ఎంతటివాడైనా శిక్షకు అర్హుడే అన్న విషయం గుర్తించాలని వైసీపీ అంటోంది. అందుకే తాను న్యాయంగానే ఉన్నానని ప్రూవ్ చేసుకోలేక చంద్రబాబు 53 రోజులు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇదంతా ఇలా ఉండగా.. నిజానికి చంద్రబాబు అరెస్ట్ అనేది ఒక రకంగా తనపై సానుభూతి సృష్టించిందనేది మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఇంత భారీ స్కామ్ లో కేసు పూర్వాపరాలు తెలుసుకోలేని అమాయక ప్రజలు చంద్రబాబును చూసి జాలి పడి ఓట్లు వేశారే తప్ప అది టీడీపీపై అభిమానం కాదని, అందుకే గత ఎన్నికల్లో ఆ సానుభూతి ఓట్ల కింద లెక్క అయిందని స్పష్టమవుతోంది. ఎన్నికల్లో కొన్ని చోట్ల ఈవీఎం ట్యాపరింగ్ జరగడం వల్ల కూడా వైఎస్సార్‌సీపీ ఓట్లు గల్లంతయ్యాయని ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతూ వీడియోలు బయటికి రావడం కూడా తెలిసిందే. పైగా ఒంటరిగా ప్రజల ముందుకు రాలేక, వైసీపీని ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకుని మరీ గెలిచిన టీడీపీది అసలు అసలైన గెలుపేనా అనే విషయం కూడా మనం ఆలోచించాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!