Pawan kalyan :ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వంపై ప్రజాధరణ విపరీతంగా తగ్గుతోంది. కూటమి నేతలు మాత్రం ఎవరి ప్రాధాన్యత వారు పెంచుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రజలే కాదు, ప్రకృతి సైతం వారికి సహకరించడం లేదు. సంకీర్ణ ప్రభుత్వంలో నేతలెవరో ప్రజలకు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. మొన్న పవన్ వరద బాధితుల పరామర్శ విషయంలో ఇబ్బంది అంటూ, వైరల్ ఫీవర్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. నేతలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ఒక్క పక్క పార్టీని, అధికారాన్ని కాపాడుకోవాలనుకునే పవన్ కు ప్రజల్లో ఇప్పుడిప్పుడే వస్తున్న వ్యతిరేకతను చూసిభయపడుతున్నారు.
ఇటీవల ఆకివీడుకు చెందిన కృష్ణవేణి అనే వృద్ధురాలు తమ కష్టాలు చెప్పుకోవడానికి విజయవాడకు వచ్చింది. పంచాయతీ రాజ్ గేట్ బయట కూర్చోంది. అటుగా వచ్చిన పవన్ ను ఆమెను చూసి భోజనం కూడా చేయలేదని గ్రహించి కారులోనే భోజనం పెట్టించారు. వృద్ధరాలు కష్టాలు అడిగి తెలుసుకున్నారు. తనకు భర్త లేడని, పెన్షన్ చాలడం లేదని, తమ కొడుకు పరిస్థితి కూడా సరిగా లేదని, గత ప్రభుత్వం ఇచ్చింది సరిపోక, ఇప్పుడు ఎక్కువ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతోనే నేతలను కలిసేందుకు ఇక్కడకు వచ్చానని చెప్పడంతో… పవన్ అధికారులకు ఏదో మొక్కుబడిగా అన్ని వచ్చేలా చూడాలని ఆదేశించారు.
వృద్ధురాలు చెప్పిన కష్టాలను బట్టి కూటమి ప్రభుత్వ లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయని చెప్ప వచ్చు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు చేయగల్గినంత చేసింది. అధికారం కోసం అడ్డగోలు హామీలు, పెన్షన్లు, నిత్యావసరాలు పెంచుతామని, సూపర్ సిక్స్ అంటూ అవసరం తీరాక కూటమి సర్కార్ హామీలను గాలిలోకి వదిలేసింది. స్వయంగా వచ్చి కష్టాలు చెప్పుకున్న వృద్ధురాలను పక్కనపెడితే… అదే సమస్యలతో బాధపడుతున్న వారు ఇంకెంతమంది బయట ఉన్నారో అనేది తొలుస్తున్న ప్రశ్న. మరి పవన్ కల్యాణ్ జగన్ ఆదరణ, సింపతిని కొట్టాలనే ఆలోచన సాధ్యం కాదని తెలుసుకున్నట్లే. పెన్షన్ సరిపోవడం లేదని, సమస్యలు ఉన్నాయని బాధపడుతున్న ఇలాంటి వృద్ధులు రాష్ట్రంలోని ఎంతమంది ఉంటే అంతమంది ఇలానే విజయవాడకు వస్తే పరిస్థితి ఏంటని నేతల్లో గుబులు మొదలైంది. కొన్ని చోట్ల ఇలాంటి సమస్యలు బయటకు వస్తే తమ స్వార్థ స్వరూపం తెలిసిపోతుందని కూటమినేతలే అడ్డుకుంటున్నారు. సంక్షేమాన్ని తాకట్టు పెట్టించి అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన కుట్రకూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఇలాంటి పరిస్థితులు రిపీట్ కావడం ఖాయం.
————- హరీష్ ——————————-