Ap politics:పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసి విజయం సాధించారు. పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో స్థానిక టీడీపీ నేత వర్మ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ గెలుపుకు కృషి చేశారు. పవన్ కల్యాణ్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికి ఆయన గెలుపు కోసం వర్మ విసృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ సైతం తన గెలుపును వర్మ చేతుల్లో పెడుతున్నాంటూ వ్యాఖ్యానించారు. అయితే పవన్ గెలిచిన తర్వాత ఎక్కడ కూడా వర్మ పేరు ప్రస్తావించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆయనపై గుర్రుగా ఉన్నాయి.
ఇదే సమయంలో టీడీపీ నేత వర్మపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం సంచలనంగా మారింది. కూటమి గెలిచిన కొద్ది రోజులకే పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జనసేనకు చెందిన కొందరు కార్యకర్తలు టీడీపీ నేత వర్మపై దాడికి దిగారు. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే వర్మ కారు పూర్తిగా ధ్వంసమైంది. వర్మ త్యాగానికి సరైన ప్రతిఫలమే ఇచ్చారంటూ టీడీపీ నాయకులు వాపోతున్నారు. ఈ ఘటనతో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇక వర్మ కు అధికారిక కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని టీడీనీ క్యాడర్ అసంతృప్తితో ఉందట.రెండు పార్టీల అధినాయకత్వాలు కలిసే ఉన్నా.పిఠాపురంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదట.
ఈ పరిణామాలపై వర్మ మద్దతుదారులు ఆగ్రహంతో ఉన్నారు.ఇప్పటికే అనేక సందర్భాల్లో బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కరు.అలాగే స్థానికంగా కాకినాడ జనసేన ఎంపీ తో వర్మకు దూరం పెరిగిందనే ప్రచారము జరుగుతోంది. అయితే ఎప్పటికప్పుడు టీడీపీ , జనసేన అధిష్టానాలు నియోజకవర్గంలో రెండు పార్టీలు కలిసి పనిచేసుకోవాలి అని సూచిస్తున్నా. తమకు సరైన గుర్తింపు లభించడం లేదని టీడీపీ క్యారెక్టర్ అసంతృప్తితో ఉంది.
ముఖ్యంగా వర్మను అధికారిక కార్యక్రమాలకు దూరం పెట్టడం, పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై వర్మ మద్దతుదారులు ఆగ్రహంతో ఉన్నారు.జనసేన నేతలు మాత్రం ఆ స్థాయిలో వర్మకు గుర్తింపు ఇవ్వడం లేదని వర్మ అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన స్థానికంగా నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకు వర్మ ను ఆహ్వానించడం లేదట.ఈక్రమంలోనే వర్మ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించారు. సాధ్యమైనంత తర్వగా ఆ ఎమ్మెల్సీ పదవి తీసుకుని నియోజకవర్గంలో తన పవర్ చూపించాలని వర్మ భావిస్తున్నారు. తద్వారా జనసేనకు నియోజకవర్గంలో చెక్ పెట్టాలనే ఆలోచనలో వర్మ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ రెండు విభేదాలు ఇంకెంత దూరం వెళ్తాయో చూడాల్సి ఉంది.