Sunday, September 8, 2024

ys jagan:జగన్ ఇచ్చిన పదవితో జూలు విదిల్చిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి

- Advertisement -

ys jagan:ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో సంక్షోభం కొనసాగుతోంది. రోజుకో ఇద్దరు ముగ్గురు ప్రజా ప్రతినిధులు తమ పదవులు వదులుకుంటున్నారు. మరి కొందరితో టీడీపీ నేతలు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్న పదవిని వదులుకుని కొత్త పదవి వస్తుందో రాదో తెలియకుండా రిస్క్ చేస్తూ కూడా వైసీపీ గోడ దూకి పోతున్నారు అంటే చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయడమే కాకుండా ఇద్దరు ఎమ్మెల్సీలు తమ పదవులు వదులుకుంటూ వైసీపీకి షాకిచ్చారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ క్యాడర్ డీ మోరలైజ్ అవ్వకుండా తక్షణమే ఏదోకటి చేయాలని భావిస్తున్నారు జగన్. ముఖ్యంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ఇవాళ మరికొన్ని నిర్ణయాలు ప్రకటించారు. ఇందులో జిల్లా అధ్యక్షుల మార్పులు సహా పలు నియామకాలు ఉన్నాయి. అలాగే మాజీ అదనపు అడ్వకేటా్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కీలక పదవి లభించనున్నట్లు సమాచారం కూడా లభించింది

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్ ను నియమించారు. అలాగే పెనమలూరుకు చెందిన వేణుగోపాల్ కృష్ణమూర్తిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అటు వైసీపీ హయాంలో అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే వైసీపీలో 41 అనుబంధ విభాగాలకు అధ్యక్షుల్ని కూడా నియమిస్తూ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎప్పటి నుంచో పార్టీ తోనే ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డిని నియమించారు. అలాగే నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని నియమిస్తూ జగన్ మరో ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో వైసీపీ ఓటమి పాలయ్యాక జరుగుతున్న ఈ నియామకాలతో పార్టీలో జవ సత్వాలు నింపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఐదేళ్ల పాటు పార్టీని నిలబెడతారని భావిస్తున్న, ఆర్ధికంగా బలవంతులైన వారిని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కూటమి ప్రభుత్వంతో సై అంటే సై అనే నేతలను జగన్ ఎంపిక చేస్తున్నారు. తద్వారా ఐదేళ్ల పాటు క్యాడర్ లోనూ పాజిటివ్ ఫీల్ నిలబెట్టాలని భావిస్తున్నారు. కొద్ది కాలంగా వైకాపాలోని జగన్ తర్వాత ఉన్న కొందరు నాయకులు పైన ఆ పార్టీలో అసంతృప్తి ఉన్న మాట కూడా వాస్తవమే. అసాంఘిక శక్తిగా రాజ్యాంగేతర శక్తిగా అరాచక శక్తిగా అన్ని శాఖలకి సంబంధించిన మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి కారణంగానే పార్టీ ఓడిపోయిందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసాంఘిక శక్తిగా రాజ్యాంగేతర శక్తిగా అరాచక శక్తిగా అన్ని శాఖలకి సంబంధించిన మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి కారణంగానే పార్టీ ఓడిపోయిందని కూడా పార్టీ నేతల్లో వినిపిస్తున్న వాదన. వీటి గురించి కూడా జగన్ తొందర్లోనే స్పందించి ఏదైనా యాక్షన్ తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!