బిగ్ బ్రేకింగ్ : టాలీవుడ్ లో గురూజీ గా పేరొందిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు, సినీ నటి పూనమ్ కౌర్ కు మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉంది. త్రివిక్రమ్ ను ఉద్దేశించి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పూనమ్ పలుమార్లు విమర్శలు గుప్పించింది. తాజాగా త్రివిక్రమ్ ను ఆమె మరోసారి టార్గెట్ చేసింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన తరుణంలో త్రివిక్రమ్ ను ఉద్దేశించి ఆమె సంచలన ట్వీట్ చేశారు.
జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మాస్టర్ అని పిలవొద్దని పూనమ్ ట్వీట్ చేసింది. ఇదే సమయంలో త్రివిక్రమ్ గురించి స్పందిస్తూ. ఆయనపై తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గతంలో ఫిర్యాదు చేశానని అయితే సినీ పెద్దలు తన ఫిర్యాదులు పట్టించుకోలేదని విమర్శించింది. తనను రాజకీయంగా అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పింది. ఇప్పటికైనా సినీ పెద్దలు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని వ్యాఖ్యానించింది.
పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై ‘మా’ ఇంకా స్పందించకపోయినా ఫిలిం ఛాంబర్ మాత్రం స్పందించింది. లైంగిక దాడుల కేసుల పరిష్కారానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ లో కీలక సభ్యుడిగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ పూనమ్ కౌర్ ఎప్పుడు ఫిర్యాదు చేసిందో ఎందుకు ఫిర్యాదు చేసిందో ఫిలిం ఛాంబర్ కు తెలియదని అన్నారు. ఫిర్యాదు లేకుండా తాము ముందుకు వెళ్లలేమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
తనకు అన్యాయం జరిగినట్టు పూనమ్ భావిస్తే ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు ఇవ్వాలని తమ్మారెడ్డి సూచించారు. పూనమ్ ఫిర్యాదును ‘మా’ తమకు ఫార్వర్డ్ చేసినా తాము ఆ అంశంపై విచారిస్తామని తెలిపారు. ఫిలిం ఛాంబర్ లో ఓ బాక్స్ ఉంటుందని ఆ డబ్బాలో ఎవరైనా ఫిర్యాదు వేసి వెళ్లిపోవచ్చని చెప్పారు. లేదా వాట్సాప్, ఈమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని ఆయన చెప్పారు. మరోవైపు పూనమ్ కౌర్ విషయంలో త్రివిక్రమ్ ఏం చేశారనే చర్చ సినీ అభిమానుల్లో పెద్ద ఎత్తున సాగుతోంది.
ఈ సందర్భంగా ఇంకా మా అసోసియేషన్ స్పందించకపోవడంతో సినీ పెద్దలంతా కలిసి త్రివిక్రం ని కాపాడుతున్నారంటూ తనకి ఇక న్యాయం జరగదని భావిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ చాలా సన్నిహితుడని ఆయనే త్రివిక్రమ్ ని కాపాడుతున్నారని గతంలో పూనం కౌర్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా కూడా పవన్ పట్ల తీవ్రమైన విమర్శలు చేశారు పూనం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనే తనకు న్యాయం జరిగేలా పోరాడుతానని పూనం తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే పవన్ మరియు త్రివిక్రమ్ కి షాక్ ఇస్తూ విజయవాడలోనే పూనం కౌర్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలని మీడియా ముందు త్వరలోనే బయట పెట్టనున్నట్లు ఆమె సన్నిహితులు చెప్తున్నారు.