Wednesday, April 24, 2024

జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రశాంత్ కిషోర్.. వైసీపీకి సాయపడటం కంటే…

- Advertisement -

ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీ అధినేత జగన్ మీద విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవును మీరు వింటుంది నిజమే. ప్రశాంత్ కిషోర్ దేశ రాజకీయాల గురించి మాట్లాడే క్రమంలో జగన్ పార్టీ అయిన వైసీపీ గురించి మాట్లాడి సంచలనం సృష్టించారు. వారికి సాయం చేసే కంటే.. కాంగ్రెస్ పార్టీకి సాయపడి ఉంటే దేశం మరోలా ఉండేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2019 ఎన్నికల ముందు పార్టీ ఎన్నికల వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకున్నారు జగన్. పార్టీ ప్లీనరీ వేదికగా ప్రశాంత్ కిషోర్‌ను కార్యకర్తలకు , నాయకులకు పరిచియం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ అమలు చేసిన వ్యూహాలు, ఆయన గ్రౌండ్ లేవల్లో పని చేసిన విధానం అన్ని కూడా పార్టీ గెలుపుకు కృషి చేశాయి.

దీంతో పాటు అభ్యర్థుల బలబలాలపై కూడా ఓ అధ్యయనం చేసి.. జగన్ చేతికి రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఈ లెక్కలను అన్నింటిని బేరీజు వేసుకుని..ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకున్నారు జగన్. జగన్ మ్యానియా, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు అన్ని కలిసి 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 151 సీట్లలలో విజయం సాధించేలా చేశాయి. ఎన్నికల ముగిసిన తరువాత కూడా ప్రశాంత్ కిషోర్‌తో జగన్ స్నేహబంధాన్ని కొనసాగించారు. కాని తాను ఇక మీదట ఎన్నికల వ్యూహాకర్తగా ఏ పార్టీ చేయనని చెప్పి ప్రశాంత్ కిషోర్ తప్పుకోవడం జరిగింది. దీంతో ఐ ప్యాక్ వైసీపీకి రాజకీయ సేవలు అందిస్తోంది. ఐ ఫ్యాక్‌తో ప్రశాంత్ కిషోర్‌కు ఎటువంటి సంబంధం లేదు. తాజాగా ఆయన దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ…ఏపీ సీఎం జగన్ ..బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంటి వారు తమ లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకు తాను సాయపడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇదే సమయంలో వారికి సాయపడటం కంటే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తాను కృషి చేసుంటే బాగుండేదని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ బీజేపీని గద్దె దించాలని ఆ వ్యాఖ్యలు చేసినప్పటికి కూడా జగన్ గురించి మాట్లాడటంతో.. అవి కాస్తా మిస్ ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. తాను లేకపోతే.. జగన్ గెలిచేవారు కాదు అన్నట్లుగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడాన్ని వైసీపీ కార్యకర్తలు తప్పుపడుతున్నారు. దేశంలో మాస్ ఇమేజ్ కలిగిన నేత జగన్ ఒక్కరే అని..రాష్ట్రానికే పరిమితం అయినప్పటికి కూడా జగన్ దేశంలో క్రేజ్ సంపాదించుకున్న నాయకులలో ఒకరని వైసీపీ కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. నీలాంటి వ్యూహాకర్తలు వస్తుంటారు.. పోతుంటారు.. క్యాడర్ శాశ్వతం అని వైసీపీ కార్యకర్తలు ఢంకా బజాయించి మరి చెబుతున్నారు.దీని పైన వైసీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!