Tuesday, October 8, 2024

YS Jagan: జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి !

- Advertisement -

YS Jagan: ఏపీ అప్పుల కుప్ప అని ప్రతీ రోజూ కనిపించే హెడ్ లైన్స్ ఇపుడు కనుమరుగు అయ్యాయి. వైసీపీ అయిదేళ్ల పాలనలో ఏపీ శ్రీలంక అవుతుందని పాకిస్థాన్ లా ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంటుందని ఎన్నో భయానక స్టోరీలు రాసి కోట్లాది ప్రజలను కలవరపరిచిన ఎల్లో మీడియా ఇప్పుడు ఏమైందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేసిన అప్పుల వాటా ఎంత అన్నది కూడా అయిదు కోట్ల మంది ప్రజలకు తెలియాలి కదా అని ఆయన అన్నారు. ఏపీ ప్రజలకు రాష్ట్రం మీద సర్వ హక్కులు ఉన్నాయి. పార్టీలు ప్రభుత్వాలు మధ్యలో వస్తూ పోతూ ఉంటాయి. ఇక కట్టే పన్ను నుంచే ఖజానాకు ఆదాయం వస్తుంది అలాంటిది ఏపీకి ఉన్న ఆదాయం ఎంత అప్పులు ఎంత అన్నది నిజాయితీతో కూడిన బ్యాలెన్స్ షీట్ ప్రజలకు ఎప్పటికపుడు తెలియాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

ఏపీకి బాబు గారి మూడు నెలల పాలనలో తెచ్చిన అప్పులు ఎంత అన్న దాని మీద వైసీపీకి చెందిన మాజీ ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రశ్నలతో చెడుగుడు ఆడేశారు. పచ్చ మీడియా చంద్రబాబు అప్పుల గురించి చూపించదా అని ఆయన నిగ్గదీస్తూనే చంద్రబాబు సీఎం అయ్యాక తెచ్చిన అప్పులు ఎన్నో డిటైల్డ్ రిపోర్టునే ఇచ్చారు. ఏపీలో గడచిన నాలుగు నెలలలో బాబు గారు చేసిన అప్పు లిస్ట్ ని బుగ్గన మీడియా సమావేశంలో చదివి వినిపించారు. జూన్ 11లో రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది అని ఆయన చెప్పారు. ఇక ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా అయిదు వేల కోట్ల రూపాయల అప్పుని ఏపీ కూటమి ప్రభుత్వం గడచిన నాలుగు నెలలలో తెచ్చిందని ఆయన చెప్పారు. అందులో జూలై 2న అయిదు వేల కోట్లు తెచ్చారని, అలాగే జూలై 16వ తేదీ రెండు వేల కోట్ల అప్పు, జూలై 30వ తేదీ మూడు వేల కోట్ల అప్పు ఆగస్టు 27వ తేదీ మూడు వేల కోట్లు అప్పు, సెప్టెంబర్ మూడవ తేదీ నాలుగు వేల కోట్ల అప్పు చేశారని బుగ్గన వెల్లడించారు.

రాష్ట్రం పట్ల ఎంతో అభిమానం అంకితభావం కలిగిన వారుగా చెప్పుకుంటూ కొన్ని మీడియా సంస్థలు ఏపీ అప్పుల పాలు అని గొంతు చించుకున్నారని ఇన్నేసి వేల కోట్ల అప్పులు కూటమి ప్రభుత్వం చేస్తూంటే ఎక్కడైనా ఏ పేపర్ లో అయినా ఏ న్యూస్ చానల్ లో అయినా కనిపించిందా అని బుగ్గన ప్రశ్నించారు. కానీ వైసీపీ చేస్తే అప్పు తప్పు. కూటమి చేస్తే అది అసలు ఎక్కడా కనబడని వార్తగా ఉండడమే గొప్ప అన్నట్లుగా వారు ప్రవర్తిస్తున్న వైఖరిని ఆయన దుయ్యబట్టారు. ప్రజలకు నిజానిజాలు బుగ్గన తెలియజేశారని ఇది చంద్రబాబు మరియు కూటమి ప్రభుత్వానికి దిమ్మ తిరిగిపోయే విషయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. మొత్తానికి జగన్ కాలర్ ఎగరేసుకునే పని బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి చేశారని వారు అభిప్రాయ పడ్డారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!