Friday, October 4, 2024

Telangana: పదేళ్ల తరువాత ప్రాంతీయవాదమా? తెలంగాణాలో ఏం జరుగుతోంది?

- Advertisement -

Telangana: తెలంగాణలో ఏపీ వాదం మరోసారి పురుడుబోసుకోనుందా? ఏపీ సెటిలర్స్ నినాదం దేనికి సంకేతం? దీని వెనుక ఉన్న వారు ఎవరు? ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఇదే ప్రధాన చర్చ. మొన్న ఆ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడె కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య మాటల యుద్ధంలో ఆంధ్రోళ్లు అన్న మాట వినిపించింది. తాజాగా తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగింపుతో మరోసారి వివాదం రాజుకునేలా ఉంది. ఆర్య వైశ్యులు పెద్ద ఎత్తున గళం ఎత్తేందుకు సిద్ధపడుతున్నారు. విపక్షాలు సైతం దీనిని ప్రచారాస్త్రంగా మార్చుకునే చాన్స్ కనిపిస్తోంది. ఇంకోవైపు ఏపీ సెటిలర్స్ అసోసియేషన్ అంటూ హడావుడి ప్రారంభం కావడం హాట్ టాపిక్ గా మారింది.

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతోంది.. ఇప్పుడే రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం నెలకుంటోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఈ పరిణామాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఇబ్బంది లేకున్నా.. హైదరాబాద్ పైనే పీటముడి పడింది. అప్పటి రాజకీయ నాయకులు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టినవారి ప్రయోజనాలను స్టేక్ హోల్డర్స్ అంటూ తెరపైకి తెచ్చారు. అయితే, హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా 2014 నాటికి తెలంగాణ సాకారమైంది. ఈ గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగిసింది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ లో సెటిలయిన సీమాంధ్రుల విషయమై తీవ్ర చర్చ జరిగింది. ఈ పదేళ్లలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ రాలేదు. కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలోనే సీమాంధ్రుల పరిరక్షణ కంటూ కొన్ని సంఘాలు వెలిశాయి. తమ గొంతులు వినిపించాయి. చివరకు అంతా ప్రశాంశంతంగా ముగిసింది.

పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు తీరి.. దాదాపు పదేళ్లు బీఆర్ఎస్ అధికారం ముగిసిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేతికి పగ్గాలు వచ్చాయి. బీఆర్ఎస్ తెలంగాణలో తొలిసారిగా ప్రతిపక్షంలోకి వెళ్లింది. ఇక ఇటీవలి పరిణామాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గాంధీ ఆంధ్రా వ్యక్తి అని అక్కడికే పంపిస్తామంటూ కౌశిక్ మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్ మరోసారి తమ సెంటింమెంట్ ఆయుధమైన తెలంగాణవాదాన్ని ఎంచుకుంటోందా? అనే చర్చ మొదలైంది. అయితే బీఆర్ఎస్ అటు తరువాత దాని జోలికి పోదల్చుకోలేదు.

తెలంగాణ ఏపీ సెటిలర్స్ ఫ్రంట్ అంటూ ఇటీవల ప్రధాన మీడియాలో ఓ ప్రకటన కనిపిస్తోంది. దీనికి అడుసుమిల్లి కల్యాణ్ ప్రెసిడెంట్ గా ప్రకటనలో ఉంది. తెలంగాణలో ఏపీ సెటిలర్ల గొంతుక అనేది వీరి ఉద్దేశం. తెలంగాణలో ఉన్న ఏపీ సెటిలర్స్ కుటుంబసభ్యులందరికీ ఫ్రంట్ ఆవిర్భావ శుభాకాంక్షలను తెలుపుతున్నారు. వాస్తవానికి తెలంగాణ, ఏపీ వాదనలు సమసి అంతా ప్రశాంతంగా ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య కూడా స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కౌశిక్ రెడ్డి రాయి వేశారు. దీంతోనే తెలంగాణలో ఏపీ సెటిలర్స్ ఫ్రంట్ ఉనికిలోకి వచ్చిందా? అనే అభిప్రాయం వినిపిస్తోంది. బీఆర్ఎస్ భవిష్యత్ లో మళ్లీ తెలంగాణ వాదం వినిపిస్తే దానికి కౌంటర్ గా ఈ ఫ్రంట్ ను ముందుకుతెచ్చే ఉద్దేశం ఉందా? అనే ఊహాగానాలు వస్తున్నాయి. మరి దీని తెరవెనుక ఉన్నదెవరో? వారికే తెలియాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!