Friday, October 4, 2024

Jevan Reddy : నికార్సయిన కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి పయనమెటు?

- Advertisement -

Jevan Reddy : తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉంది. కానీ ఆ పార్టీకి తెలంగాణలో చాన్స్ వచ్చేందుకు దాదాపు తొమ్మిదేళ్లు పట్టింది. అయితే ఈ తొమ్మిదేళ్లలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు పార్టీన విడిచిపెట్టి వెళ్లారు. అదే సమయంలో ఎంతో మంది పార్టీలోకి వచ్చారు. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్న తన వాయిస్ ను వినిపించిన నికార్సయిన నేతల్లో జీవన్ రెడ్డి ఒకరు. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన సుదీర్ఘ కాలం మంత్రి పదవితోపాటు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాజకీయాలను శాసించిన జీవన్‌రెడ్డి.. పొలిటికల్‌ ఫ్యూచర్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో చాలా కీలకంగా ఉంటూ.. పార్టీ గొంతును గ‌ట్టిగా వినిపించిన జీవన్‌రెడ్డి వాయిస్‌ ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు.

గులాభీ పార్టీ దూకుడుగా ఉన్నప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి సత్తా చాటిన జీవన్‌రెడ్డికి.. పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. పార్టీలో పరిణామాలు మింగుడుపడని విధంగా తయారయ్యారంటున్నారు. దీంతో ప్రస్తుతం సైలెంట్‌ అయిపోయారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా తాజాగా చోటు చేసుకున్న ఓ ఇష్యూతో ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి బాగా క‌ల‌త చెందార‌ని వినికిడి. గాంధీభ‌వ‌న్ వేదిక‌గా కొత్త పీసీసీ చీఫ్‌ నిర్వహించిన స‌మీక్షా స‌మావేశాలే ఆయన అసంతృప్తికి కారణమనే టాక్ వినిపిస్తోంది.

పీసీసీ సారథిగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు తీసుకున్నాక.. ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లా స‌మావేశం నిర్వహించగా, సీనియర్‌ నేత జీవ‌న్ రెడ్డికి అవ‌మానం జ‌రిగినట్లు పార్టీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. స‌మావేశం కోసం సిద్ధం చేసిన ఆహ్వానితుల జాబితాలో జీవ‌న్ రెడ్డి పేరు చేర్చకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ అందరి పేర్లను ముద్రించి.. జీవన్‌రెడ్డిని విస్మరించడంతో ఆయన తీవ్రంగా కలత చెందారని చెబుతున్నారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన జ‌గిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజ‌య్ కుమార్ పేరు ఉండటం కూడా జీవన్‌రెడ్డిని అసంతృప్తికి గురి చేసిందని చెబుతున్నారు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురై.. పీసీసీ చీఫ్‌ సమక్షంలోనే త‌న ఆవేద‌న, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

గత రెండు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌న ప్రత్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి కాంగ్రెస్‌లో ప్రాధాన్యమివ్వడాన్ని పెద్దాయ‌న జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. ఈ విషయమై తన స‌న్నిహితుల వ‌ద్ద ఆవేద‌న వ్యక్తం చేస్తున్నార‌ని చెబుతున్నారు. పార్టీలో కొత్త సాంప్రదాయం తెస్తున్నారని, సీనియర్లను విస్మరిస్తున్నారని జీవన్‌రెడ్డి నిర్వేదం వ్యక్తం చేస్తున్నారంటున్నారు. వలస ఎమ్మెల్యేల విష‌యంలో పార్టీ తీసుకునే నిర్ణయం ప‌ట్ల అసంతృప్తిగా ఉన్నారంటున్నారు.

బీఆర్‌ఎస్ నుంచి ఏ ఒక్కరిని చేర్చుకోలేద‌ని బ‌య‌ట‌కు చెబుతూ.. పార్టీ స‌మావేశాల‌కు ఎలా ఆహ్వానిస్తున్నారని ప్రశ్నిస్తున్నారట జీవన్‌రెడ్డి. పార్టీ స‌మావేశాల్లో త‌న పేరు ప్రస్తావించ‌క‌పోవ‌డం కాక‌తాళీయ‌మ‌ని పీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్‌, ఇంచార్జ్ దీపాదాస్ మున్షి స‌ర్దిచెప్పే ప్రయ‌త్నం చేసినా.. జీవ‌న్ రెడ్డి మాత్రం.. వారి వాదనతో ఏకీభవించనట్లు చెబుతున్నారు. కావాలనే తనను నిర్లక్ష్యం చేస్తున్నారని అనుమానిస్తున్నారట పెద్దాయన. అందుకే పార్టీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకోవడంతోపాటు.. ఈ మధ్య జరిగిన సీఎల్పీ భేటీకి గైర్హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది.

మ‌రోవైపు తన సొంత నియోజ‌క‌వ‌ర్గం జగిత్యాలలో కూడా మెల్లిమెల్లిగా ఎమ్మెల్యే సంజ‌య్‌కు ప్రాధాన్యత పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు జీవన్‌రెడ్డి. ఇదే సమయంలో నిన్నమొన్నటి వరకు తన వెంట తిరిగిన వారిని దూరం చేసేలా ఎమ్మెల్యే సంజయ్‌ వ్యవహరిస్తుండటం పెద్దాయనను కలవర పెడుతుందని చెబుతున్నారు. నియోజకవర్గంలోని మార్కెట్ క‌మిటీ చైర్మన్లతో మొద‌లు కొని ఇత‌ర‌త్రా నామినేటెడ్‌ పదవుల భర్తీలో ఎమ్మెల్యే సిఫార్సులకే ప్రాధాన్యమిస్తుండ‌టం జీవన్‌రెడ్డికి ఆగ్రహం తెప్పిస్తుందని చెబుతున్నారు. రోజురోజుకు పార్టీలో అవమానాలు ఎక్కువ అవుతుండటం.. త్వర‌లో స్థానిక సంస్థల ఎన్నిక‌లు వ‌స్తున్న నేపథ్యంలో త‌న‌ను న‌మ్ముకున్న క్యాడ‌ర్‌కు ఎలా న్యాయం చేయాల‌నే అంశమై జీవ‌న్ రెడ్డి మ‌ద‌న ప‌డుతున్నార‌ని చెబుతున్నారు.మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచన లేని జీవన్‌రెడ్డి.. పార్టీని తన దారికి తెచ్చుకోవడం ఎలా అనే అంశంపై ఫోకస్‌ చేశారంటున్నారు. ఇదే సమయంలో జీవన్‌రెడ్డి పొలిటికల్‌ ఫ్చూచర్‌పై ఆయన వర్గంలోనే కలవరం కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మున్ముందు జీవన్‌రెడ్డి అడుగులు ఆసక్తికరంగా మారాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!