Friday, October 4, 2024

Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ కు ఊరట.. కానీ ఇన్వాల్వ్ అవ్వొద్దని సుప్రీం ఆదేశాలు

- Advertisement -

Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. హోంశాఖ కూడా ఆయన వద్దే ఉంది. ఎటువంటి కేసుల పురోగతి అయినా ఆయన సమీక్షించాల్సి ఉంటుంది. పోలీస్ విభాగాలకు సంబంధించి ఆయనకే రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కానీ ఓటుకు నోటు కేసులో మాత్రం ఆయనకు రిపొర్టు చేయవద్దని తెలంగాణ ఏసీబీకి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తాజాగా విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇవ్వడం విశేషం.

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసును వేరే కోర్టుకు బదిలీ చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కేసును బదిలీ చేయాలన్ని జగదీశ్ రెడ్డి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసును భోపాల్‌కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారని, స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ వేశారని, సిఎం, హోంమంత్రిగా ఉన్న రేవంత్‌కు ఎసిబి డిజి రిపోర్టు చేయాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ చేయాలని సూచనలు చేసింది. ఓటుకు నోటు కేసు విచారణలో సిఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఏ-1గా ఉన్నారు. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీఫెన్ సన్ కి డబ్బు ఇస్తూ ఏసీబీకి దొరికిపోయారు. ఈ కేసుకి సంబంధించి ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నారు. హోంమంత్రిగా కూడా ఆయనే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కేసును దర్యాఫ్తు చేస్తున్న ఏసీబీ నేరుగా హోంమంత్రికే అంటే రేవంత్ రెడ్డికే రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఇందులో ఇన్ క్లూడ్ అయ్యారు.ఈ కేసుని జసిస్ట్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం విచారించింది. ఈ కేసు విచారణను ముగించింది. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కేసు దర్యాఫ్తును రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తారన్నది అపోహ మాత్రమే, ఎటువంటి ఆధారాలు లేవు, అపోహలతో మేము కేసు ఇన్వెస్టిగేషన్ ని మరో రాష్ట్రానికి బదిలీ చేయలేము అని కోర్టు వ్యాఖ్యానించింది. జగదీశ్ రెడ్డి పిటిషన్ ను మేము ఎంటర్ టైన్ చేయలేము అంటూ కేసు విచారణను ముగించింది సుప్రీంకోర్టు.

అయితే, రేవంత్ రెడ్డికి కొన్ని ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఈ కేసు దర్యాఫ్తులో జోక్యం చేసుకోకూడదని రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు సూచనలు ఇచ్చింది. అలాగే ఏసీబీ కూడా ఈ కేసుకి సంబంధించి ఎటువంటి వివరాలను కూడా హోంమంత్రిగా అలాగే సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి నివేదించవద్దని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఉన్న ప్రాసిక్యూటరే కేసు విచారణను కొనసాగిస్తారని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే, ఏసీబీ కూడా స్పెషల్ ప్రాసిక్యూటర్ కు సహకరించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో ఈ ఓటుకు నోటు కేసు విచారణను పర్యవేక్షణ జరపాలని జగదీశ్ రెడ్డి తరుపు న్యాయవాది సుందరం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని కూడా అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే ఈ కేసులో రేవంత్ రెడ్డికి ఊరట దక్కినా.. కేసులో ఇన్వాల్వ్ లేకుండా సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడం విశేషం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!