Sunday, December 4, 2022

అంత సెట్.. కాని అది ఒక్కటే లోటు..జగన్ గ్రీన్ సీగ్నల్ ఇస్తే 20 లక్షల ఓట్లు వైసీపీకే

ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా జగన్ పరిపాలనపై సామాన్య ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ తన పాలనతో 100కు 100 శాతం న్యాయం చేశారని చెప్పడం లేదు కాని.. ఆయన పాలన మీద మెజార్టీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్లడంలో జగన్ విజయవంతం అయ్యారనే చెప్పాలి. చాలామంది నేతలు దీనిని మాటలలో చూపించారు. కాని జగన్ మాత్రం దానిని ఆచరణలో చూపించారు. జగన్ సీఎం అయిన తరువాత పరిపాలన రూపురేఖలు మొత్తం మార్చేశారు. వాలంటీర్ల ద్వారా పాలనను ప్రజల వద్దకే తీసుకువెళ్లారు. ఇదే సమయంలో సచివాలయాలను ఏర్పాటు చేసి.. ప్రజలకు మరింత దగ్గరైయ్యారు. ఇక వ్యవసయానికి కూడా పెద్ద పీట వేసిన ఆయన రైతులకు , కౌలు రైతులకు న్యాయం చేస్తూ వచ్చారు. రైతులకు మద్దతు ధరతో పాటు.. మధ్యలో ఎలాంటి దళారులు లేకుండా నేరుగా ప్రభుత్వమే పంటా కొనుగొలు చేయడం మొదలు పెట్టారాయన.

ఇదే సమయంలో రైతులకు పంటా రుణాలతో పాటుగా, వారికి ఆర్థికసాయంగా పెట్టుబడి ఖర్చులు ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇక మహిళలకు జగన్ సర్కార్ ఎంత చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒంటరి మహిళలకు పింఛన్లు, 45 సంవత్సరాలు పైపడిన వారికి ఆర్థిక చేయూత, మహిళ సంఘాలకు రుణాలు ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకున్న జగన్.. ఒక వర్గం ప్రజలను దూరం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఆ వర్గం ప్రజలు మరెవ్వరో కాదు.. ప్రభుత్వ ఉద్యోగులు.. అవును మీరు వింటుంది నిజమే.. జగన్ పాలన మీద ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తితో కాదు కాని.. అసమ్మతితో ఉన్నారని తెలుస్తోంది. అసంతృప్తికి అసమ్మతికి చాలా తేడా ఉంది. అసంతృప్తి అంటే పాలన నచ్చకపోవడం.. అసమ్మతి అంటే తమకు న్యాయం జరగలేదని తెలపడం.

2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు కుందిబండ మారిన సీపీఎస్ (కంట్రిబ్యూట‌రి పింఛ‌న్ ప‌థ‌కం)ను ర‌ద్దు చేస్తామ‌ని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని సాధ్యాసాధ్యాలన్నీ ఆర్థిక కష్టాలతో ముడిపడి ఉండటంతో ఆయన కూడా వెనకాడుతున్నారు. దీనిపై జగన్ అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన ప్రధాన డిమాండ్ కూడా ఇదే. అయితే నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు అంటే వారి కుటుంబ సభ్యులతో కలిపితే ఈ సంఖ్య దాదాపు 20 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ఒక్క హామీని నెరవేరిస్తే కనుక.. ఖచ్చితంగా మరోసారి విజయం జగన్‌దే విజయం అవుతుందని చెప్పడంలో అనుమానం లేదు. అలా అని ప్రభుత్వ ఉద్యోగులందరు కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని కూడా కాదు. సీపీఎస్ రద్దు చేస్తే కనుక 20 లక్షల ఓట్లు వైసీపీకే పడతాయని చెప్పడంలో ఢోకా లేదనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్లతో ప్రతిపక్షంలో కూర్చున్న జగన్‌కు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనిపిస్తుంది. ఎన్నికల నాటికి ఈ ఒక్క హామీని నెరవేరిస్తే మళ్లీ జగన్ సీఎం కూర్చిలో కూర్చోవడం ఖాయం అని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరి అన్ని వర్గాలకు ఆకట్టుకున్న జగన్.. ప్రభుత్వ ఉద్యోగులను ఎలా సంతృప్తి పరుస్తారో చూడాలి.

Related Articles

Latest News

error: Content is protected !!