Sunday, September 8, 2024

Ys sharmila:బయట పడిన షర్మిల దొంగ రాజకీయం.. జగన్ ఉగ్రరూపం?!

- Advertisement -

Ys sharmila:ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయం బాగానే ఉంది అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆమె కేవలం రెండు ముక్కల్లో మాత్రమే విమర్శలు చేస్తారు. ఇక గత ప్రభుత్వం అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం బాగానే తూర్పారపడతారు. భారీ వరదలు వచ్చింది ప్రస్తుతం. దీనికి కారణాలు ఏమిటో అందరికీ తెలుసు. ఆక్రమణల వల్లనే బుడమేరు పొంగి విజయవాడని ముంచేసింది. ఆ పాపంలో ఉమ్మడి ఏపీని పాలించిన నాటి కాంగ్రెస్ నుంచి టీడీపీ వైసీపీ వరకు అందరి పాత్ర ఉంది. అంతే కాదు భారీగా వరదలు వస్తాయని ఊహించక పోవడం కూడా ఎంతో కొంత ప్రభుత్వ వైఫల్యం కిందకే వస్తుందని అంటున్నారు.

అయితే షర్మిల మాత్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమిని వదిలేసి జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడాన్ని వైసీపీ నేతలు తప్పు పడుతున్నారు. గత ప్రభుత్వం అయిదేళ్లలో నీటి ప్రాజెక్టులకు కనీసం ఇయర్లీ మెయింటెనెన్స్ కి కూడా నిధులు ఇవ్వలేదు అని షర్మిల విమర్శించారు. దాని ఫలితంగా నదులలో గేట్లు తేలియాడటం అంతా చూశారు అని ఆమె అన్నమయ్య ప్రాజెక్టు గేట్ విరిగిపడిన ఉదంతాన్ని గుర్తు చేశారు. ఆ తరువాత ఆమె కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీద పడ్డారు. ఏపీలోని పార్టీల మద్దతుతో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏపీకి ఏమి సాయం చేస్తోంది అని నిలదీశారు. ఏపీని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆమె కేంద్రాన్ని కోరారు.

ఇక ఏపీలో ప్రకాశం బ్యారేజిని ఢీ కొన్న పడవల ప్రమాదం మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దీని వెనక ఏ శక్తులు ఉన్నాయో వెలికి తీయాలని అన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజ్ కే ఈ రకమైన పరిస్థితి వస్తే ఎలా అని ఆమె అన్నారు. మరి పడవలు ప్రకాశం బ్యారేజిని ఢీ కొట్టడం వెనక కుట్ర కోణం ఉందని టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే చెబుతోంది. ఇపుడు షర్మిల కూడా దాని మీదనే డిమాండ్ చేస్తున్నారు. మరి ఇండైరెక్ట్ గా ఆమె చేసిన ఈ కామెంట్స్ కూడా ఎవరి మీద అన్న చర్చ వస్తోంది.

మొత్తం మీద చూస్తే వైసీపీనే షర్మిల టార్గెట్ చేశారు అని అంటున్నారు. అంతే కాదు కేంద్రంలో బీజేపీ ఎటూ కాంగ్రెస్ కి శత్రువే కాబట్టి ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఓకే. కానీ ఏపీలో టీడీపీ కూటమిలో కూడా బీజేపీ ఉందని ఆమెకు తెలియదా అని అంటున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మీద కంటే కూడా వైసీపీ మీదనే ఆమె ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చర్చకు కారణం అవుతున్నాయి. ఇంకొక పక్క షర్మిల మరియు టీడీపీ కుమ్మక్కయి జగన్ మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇదంతా గమనిస్తుంటే షర్మిల దొంగ రాజకీయం బయట పడినట్లే అనిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!