Thursday, October 3, 2024

Congress-BRS: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్..అనర్హత వేటుపై హైకోర్టు కీలక ఆదేశాలు

- Advertisement -

Congress-BRS: తెలంగాణ ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ తీర్పు వెల్లడించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యే అంశం పై హైకోర్టు స్పందించింది. ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై హైకోర్టు కీలక అదేశాలు ఇచ్చింది. అసెంబ్లీ కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అనర్హత పిటీషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందుంచాలని స్పష్టం చేసింది.

ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు వలసబాట పట్టిన సంగతి తెలిసిందే. సుమారు 10 మంది ఎమ్మెల్యేలు గోడ దూకారు. మరికొందరు పార్టీ నుంచి జంప్ అయ్యేందుకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారి పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. దీని విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వచ్చిన అనర్హత పిటీషన్లను స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విచారణ పైన సమాచారం ఇస్తూ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది. ఫిర్యాదు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటుగా పార్టీ మారిన వారి పైన వచ్చిన ఫిర్యాదుల గురించి ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెబుతున్నారు.

బీఆర్ఎస్ నుంచి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. అయితే కేవలం ముగ్గురుపై అనర్హత వేటు వేయాలని మాత్రమే బీఆర్ఎస్ కోరడం విశేషం. బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన దాఖలు చేసారు. కానీ ఈ ముగ్గురితో పాటుగా పార్టీ మారిన వారి పైన అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసారు. దీని పైన విచారించిన హైకోర్టు నాలుగు వారాల్లో స్పీకర్ షెడ్యూల్ ఖరారు చేసి…నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం అసెంబ్లీ కార్యదర్శి వద్ద ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న అనర్హత పిటీషన్లను స్పీకర్ వద్ద తక్షణం ఉంచాల్సి ఉంటుంది. నాలుగు వారాల్లోగా విచారణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయాలని..ఆ తేదీలను హైకోర్టుకు సమాచారం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. తమ పిటీషన్ల పైన స్పీకర్ కాలయాపన చేస్తున్నారనేది పిటీషనర్ల ప్రధాన ఫిర్యాదు. ఇక, ఇప్పుడు హైకోర్టు తాజా ఆదేశాల తో అసెంబ్లీ కార్యదర్శి వ్యవహరించాల్సి ఉంటుంది. దీంతో స్పీకర్ తుది నిర్ణయం కీలకం కానుంది.అయితే ఇంతలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కోర్టులో ప్రతికూల తీర్పు రాక మునుపే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!