Friday, October 4, 2024

TDP- YCP: రెచ్చిపోతున్న టీడీపీ లీడర్ పట్టాభి కి దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్

- Advertisement -

TDP- YCP: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు పెట్టి వారిని జైలుకి పంపించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎలాంటి నేరం చేయని వారి పైన కావాలనే కేసులు పెట్టి రాష్ట్రంలో దారుణమైన రాజకీయం చేస్తున్నారని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి కేసులో ఇప్పటికే వైసీపీ నేత‌, బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిని పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా గుంటూరు జైలుకు వెళ్ళారు. నందిగం సురేశ్ చాలా సౌమ్యుడని ఆయన పైన అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టి కావాలనే ఆయన్ని మరియు ఆయన కుటుంబ సభ్యులని మానసికంగా ఇబ్బంది పెట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధమైన చర్యలకు పాల్పడుతోంది అని వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి కేసుతో నందిగం సురేశ్ కి ఎలాంటి సంబంధం లేదని కావాలనే ఆయన్ని ఇరికి౦చారని దాదాపు 14౦ మంది పైన కేసులు పెట్టారని దీని గురించి తొందరలో విచారణ జరిపించాలని వీరిని నిర్దోషులుగా ప్రకటించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కావాలనే అన్నిట్లో వైఎస్సార్సీపీ శ్రేణులని అందులో ఇరికించడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా పని చేస్తున్నారు తప్పితే న్యాయం వైపు వారు లేరని ఆయన అన్నారు. నంబూరు శంకర్ రావు మీద దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు తప్ప ఏమీ చేయలేదని దాడి చేసిన వారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ స్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆయన దుయ్యబట్టారు. రాజకీయ పార్టీలకి అతీతంగా లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన పోలీసులే ఈ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ప్రతిపక్షం లేకపోతే వారు అధికారంలో ఉంటూ ఏది చేసినా చెల్లుతుందనే ఉద్దేశంతోనే కావాలని ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులని మరియు కార్యకర్తలని నిర్మూలనం చేసే పనులు చేస్తున్నారని ఆయన కీలక వ్యాఖ్యల చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగిందని కావాలనే అక్రమ కేసులు పెట్టి తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం కాకుండా వారిని రెచ్చగొట్టి వారు అలా ప్రవర్తించేలా చేసిన టీడీపీ లీడర్ పట్టాభి పైన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడుల కేసులో తన గురించి అంతా మర్చిపోయారని సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్న పట్టాభికి ఇలా మళ్ళీ తన గురించి చర్చలు జరగడం షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!