Friday, October 4, 2024

Andrapradesh: ఏపీకి ఆరో స్థానం.. వైసీపీ హయాంలో కృషికి తగిన గుర్తింపు

- Advertisement -

Andrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదేళ్లలో సూక్ష్మ సేద్యం అమలులో దేశంలోనే ఆరో స్థానంలో నిలిచింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ అభివృద్ధి కోసం చేసిన కృషి, రైతుల సంక్షేమానికి తీసుకున్న చర్యలకు తగిన గుర్తింపు లభించినట్లయింది. ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో 3.09 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. తద్వారా రాష్ట్రంలో ఐదేళ్లలో 2,73,888 మంది రైతులకు ప్రయోజనం చేకూరినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం.. వైఎస్సార్‌సీపీపై చేసిన ఆరోపణలకు అడ్డుకట్ట పడినట్లయింది. గత ప్రభుత్వం రైతులకు సూక్ష్మ సేద్యం పరికరాలు కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు చేసిన ప్రచారాల్లో వాస్తవం లేదని స్పష్టమైంది. స్వయంగా కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాలతో సహా గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవసాయ ప్రగతిని వివరించడం విశేషం.

సూక్ష్మ సేద్యం అమలు కింద డ్రిప్, స్ప్రింక్లర్‌ పరికరాలతో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చురుకుగా వ్యవహరించిందని వెల్లడించింది. ఈ పథకంపై నీతి ఆయోగ్‌ అధ్యయనం నిర్వహించిందని చెప్పింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరిచి, పంట ఉత్పాదనను, ఉత్పత్తిని పెంచుకుని, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రైతుల ఆదా­యం పెరిగేలా చూడడమే ఈ పథకం లక్ష్యమని.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఊహించని ఎదుగుదల కనిపించిందని నీతి ఆయోగ్‌ ప్రశంసించినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!