BRS-CONGRESS: కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేసుకుందా? ఆయనను కేసుల్లో ఇరికించడానికి డిసైడ్ అయ్యిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీచేసి గెలిచారు కౌశిక్ రెడ్డి. అప్పటి నుంచి చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం అండతో గట్టిగానే కాంగ్రెస్ ను అటాక్ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్ తో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కత్తి వేలాడుతోంది. సహజంగానే ఇది కాంగ్రెస్ నేతలకు మంట కలిగించే విషయం. అందుకే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య వార్ నడుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పై గతంతో వాళ్లు చేసిన తప్పిదాల వల్లే.. తెలంగాణ అన్నిరంగాల్లో వెనక్కు పోయిందని విమర్శిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలుసైతం కాంగ్రెస్ కు అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ నుంచి భారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి జంప్ అయిపోయారు. మరోవైపు ఇటీవల.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పీఏసీకి చైర్మన్ గా శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించింది. దీంతో ఇది కాస్త రచ్చకు దారితీసింది.
తాజాగా పాడె కౌశిక్ రెడ్డి ఇంటిపై దండయాత్ర చేశారు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. శేరిలింగంపల్లి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన గాంధీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఇటీవల పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అందులో గాంధీ ఒకరు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ కు హైకోర్టు గడువు ఇచ్చింది. దీంతో పెను దుమారమే నడిచింది. అయితే దీని నుంచి అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడ వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లలో ఒకరైన అరికెపూడి గాంధీకి ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా ప్రకటించింది. వాస్తవానికి ఆ పదవిని ప్రతిపక్షాలకు కేటాయిస్తారు. అయితే గాంధీ తాను బీఆర్ఎస్ సభ్యుడును గనుకే పీఏసీ చైర్మన్ పోస్టు ఇచ్చారని సమర్థించుకున్నారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభమైంది.
దీనిపై బీఆర్ఎస్ నుంచి పాడె కౌశిక్ రెడ్డి స్పందించారు. గాంధీ గారూ మీకు నేను ఓపెన్ బంపరాఫర్ ఇస్తున్నా.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని మీరు అంటున్నారు కదా..? రేపు పొద్దున్న 11 గంటలకు మీ ఇంటికి వస్తాను. బీఆర్ఎస్ పార్టీ కండువా ఇద్దరం కప్పుకుని, నీ ఇంటి మీద ఇద్దరం కలిసి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేద్దాం.. మళ్లీ నువ్వు, నేను, వివేకానంద ముగ్గురం కలిసి బీఆర్ఎస్ భవన్‌కు వచ్చి ప్రెస్ మీట్ పెడుదాం. దీనికి సిద్ధంగా ఉండాలని గాంధీ గారికి తెలియజేస్తున్నాను అని నిన్న రాత్రి పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు.
దీనిపై అరికెపూడి గాంధీ ధీటుగా స్పందించారు. పాడె కౌశిక రెడ్డికి సవాల్ చేస్తూ వీడియో ఒకటి విడుదల చేశారు. నీ బాంచెత్ రారా.. తెల్చుకుందాం.. ఇలా కౌశిక్ రెడ్డికి , గాంధీకి మధ్య తీవ్ర సవాళ్ల పర్వం కొనసాగిందని కూడా చెప్పుకొవచ్చు.ఇదిలా ఉండగా.. పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. అరికెపూడి గాంధీ ఇంటి బైట కూడా పోలీసులు భారీ ఎత్తున కట్టుదిట్టమై భద్రత చేపట్టారు. పాడి కౌశిక్ రెడ్డి.. బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నారని కూడా అరికెపూడి మండిపడ్డారు. అయితే ఈ రోజు ఉదయం అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు, కాంగ్రెస్ అభిమానులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దండెత్తారు. కోడిగుడ్లతో దాడి చేశారు. అయితే అక్కడ పరిస్థితిచూస్తే మాత్రం ఉద్రిక్తంగా ఉంది.