Thursday, October 3, 2024

Prakasham barrage: పడవల కుట్ర కోణం లో అడ్డంగా ఇరుక్కున్న టీడీపీ ?

- Advertisement -

Prakasham barrage: ఇటీవల విజయవాడలో వరదలు వచ్చిన నేపధ్యంలో ప్రకాశం బ్యారేజీలో మూడు పడవలు బ్యారేజీ గేట్లకు అడ్డం పడిన సంగతి మనందరికీ తెలిసిందే. బ్యారేజీ గేట్లకు పడవలు అడ్డం పడటమే కాకుండా గేట్లకు సంబంధించిన దిమ్మెలను ఆ పడవలు డీ కొనడంతో అంతా ఆందోళనకి గురయ్యారు. ఇదంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారే కావాలని చేశారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి వారు చూపిస్తున్న ఆధారాలు ఏంటంటే ఆ బోట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగుల్లో ఉన్నాయని. ఈ కేసు విషయంలో ఇప్పటికే ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అందులో ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషని ఇది కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర అని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. కొంచెం తెలివిగా ఆలోచిస్తే వెంటనే ఎవరికైనా తెలిసిపోతుంది ఇది కేవలం కావాలని చేసిన ఆరోపణ మాత్రమే అని. కేవల౦ పడవలకి ఉన్న రంగులని బట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర అంటే జనం మాత్రం ఎలా నమ్ముతారు. పడవలకి మొత్తం పన్నెండు రంగులు ఉన్నాయి. మరి ఆ పన్నెండు రంగులకి సంబంధించి చాలా పార్టీలు ఉంటాయి కదా రాష్ట్రంలో. అలాంటప్పుడు కేవలం ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర అంటే ఎలా?

ఒక పార్టీకి సంబంధించిన రంగులు సామాన్య ప్రజలు ఇంకెవరూ వాడకూడదు అనేది ఎంత అశాస్త్రీయమైన ఆలోచన. పక్కన పార్కింగ్ చేసి ఉన్న కొన్ని పడవలకి కూడా బ్లూ కలర్ వేసి ఉన్నట్లు మీడియాలో చూపించడం అందరూ చూశారు కదా. అంటే అక్కడ ఉన్న పడవలు అన్నిటికీ ఆ రంగులు ఉన్నప్పుడు అడ్డం పడిన పడవలు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి అంటే ఎలా? పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు కదా మరి అప్పుడే ఈ ఆరోపణలు ఎందుకు? పార్కింగ్ ప్లేసులో పార్క్ చేసిన పడవల తాళ్ళు తెగిపోయి అవి అలా వరద ప్రవాహానికి కొట్టుకు వచ్చాయి అని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలిన విషయం. ఈ విషయం గురించి ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. వరద ఉద్ధృతి చాలా ఉన్న నేపధ్యంలో అలా జరిగి ఉండవొచ్చు అనేది మనకి అర్ధం అవుతున్న విషయం. కానీ కూటమి ప్రభుత్వం కావాలనే ఒక పక్క ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతూ తినడానికి తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతుంటే ఇక్కడ కూడా రాజకీయం చేస్తోంది. కావాలనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర లాగా ప్రజల్లో చిత్రీకరించి ఆ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడమే పనిగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. ఏది ఏమైనా వారి ప్లాన్ బెడిసి కొట్టిందని ఈ విషయంలో కావాలనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరికించాలని చూసిన టీడీపీనే ఇరుక్కుందని రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్న చర్చ.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!