Tuesday, October 8, 2024

YS Jagan: జగన్‌పై ‘లక్ష’ గురి.. విఫల యత్నం చేస్తున్న టీడీపీ

- Advertisement -

YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పెద్దఎత్తునే ఆరోపణలు చేస్తుంటుంది. అధికారంలో ఉన్నామనే గర్వమో.. లేదా ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్న పార్టీని మరింత నీరుగార్చాలనే ప్రయత్నమో తెలియదు గానీ విమర్శలు చేయడంలో మాత్రం ఎప్పుడూ టీడీపీ ముందుంటుంది. ఆ ఆరోపణల్లో ఎంత నిజం ఉందో లేదో, అసలు వాటికి ఆధారాలు ఉన్నాయా? జనం నమ్ముతారా అన్నది పక్కనపెట్టి ఘాటు విమర్శలు చేస్తూ మరింత దిగజారుతోంది. ఈ క్రమంలోనే జగన్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో సీబీఐ కేసులు బనాయించడంలో కాంగ్రెస్‌తో పాటు టీడీపీ కూడా కీలక పాత్ర వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారని ఇలా అర్థం లేని ఆరోపణలు చేసింది.

జగన్ తన హయాంలో లక్ష కోట్లు కూడబెట్టుకున్నారని టీడీపీ విమర్శించినా 2014 ఎన్నికల సమయంలో మాత్రం అది జనంలో వర్కౌట్ కాలేదు. అలా టీడీపీ 2014లో పొత్తులతో గెలిచినప్పటికీ, 2019లో మాత్రం ప్రజలు వైసీపీకే పట్టం కట్టారు. ఇటీవల కూడా ప్రకాశం బ్యారేజీకి అడ్డంగా వచ్చిన భారీ బోట్లు వైసీపీవే అని ఆరోపిస్తూ, జనాలను జగన్ నీళ్లల్లో ముంచాలని చూశారని ఆరోపించింది. జగన్ లక్ష మందిని పొట్టన పెట్టుకోవాలని చూశారని సోషల్ మీడియా వేదికగా జనాల్లో తప్పుడు భావాలను నాటుకుంటూ వెళ్లింది. అంటే మళ్లీ ఇక్కడ కూడా లక్ష నంబరే వచ్చింది. జనాల్లో విపరీతమైన అభిమానం ఉన్న జగన్ లాంటి నేతపై ఏవైనా భారీ ఆరోపణలు చేయాలనుకున్నపుడు ఇలా పెద్ద నంబర్ ఉండాలని అనుకుంటుందో ఏమో కానీ ఎలా చూసినా.. లక్ష మాత్రం కామన్ అవుతుంది. జగన్‌కు గురి పెట్టి లక్షతో కొట్టాలనుకుని .. టీడీపీ తన లక్ష్యం మాత్రం మర్చిపోయి దారి తప్పుతోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనాల్లో అభిమానం, ఆదరణ పెంచుకున్న వైసీపీని నీరుగార్చాలని టీడీపీ విఫల యత్నాలు చేస్తుందని అంటున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!