Thursday, October 3, 2024

TDP: ఈ ఎమ్మెల్యే మాకొద్దు..టీడీపీ అధిష్టానానికి టీడీపీ నాయకులు ఫిర్యాదు

- Advertisement -

TDP: టీడీపీ ఎమ్మెల్యేల తీరు ప్రజలకే కాకుండా అధికార పార్టీకి సైతం ఇబ్బందికరంగా మారింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మీపై లైంగిక దాడి చేయడం, దీనికి సంబంధించిన వీడియోలు సైతం బయటకు రావడం జరిగింది. తీంతో కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఎమ్మెల్యే మరెవ్వరో కాదు..ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్.

తొలిసారి ఎమ్మెల్యే కావడంతో అవగాహనలేమి తనంతో ఆయన చేస్తోన్న పనులు పార్టీతో పాటు, ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తీసుకువస్తోందని టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గతంలో సదరు ఎమ్మెల్యే వైసీపీకి చెందిన నాయకుడు ఇంటిని కూల్చివేసి పెద్ద సీనే క్రియేట్ చేశారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌పై అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణలు టీడీపీ ఎమ్మెల్యేపై ఉన్నాయి. మ‌హిళ‌ల‌ను అధికారికంగా ఐదు గంట‌ల పాటు పోలీస్‌స్టేష‌న్‌లో ఉంచి తన అధికార దర్పాన్ని ప్రదర్శించారాయన.దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేకు చీవాట్లు పెట్టడం జరిగింది. అయిన తీరు మార్చుకుని ఎమ్మెల్యే వరుస వివాదాల్లో నిలుస్తున్నారు.

తాజాగా ఎమ్మెల్యే కారణంగా టీడీపీ సర్పంచ్ భార్య అత్మహత్యయత్నం చేయడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో కొలికపూడి శ్రీనివాస్‌ గెలుపుకు చిట్టేల టీడీపీ సర్పంచ్‌ శ్రీనివాస్‌ సహకరించారు. అయితే గెలిచిన తర్వాత సర్పంచ్‌‌ను ఎమ్మెల్యే పూర్తిగా దూరం పెడుతూ వచ్చారు. ఇదే సమయంలో చిట్టేల సర్పంచ్‌ పేకాట ఆడుతూ పోలీసులకు దొరకడంతో అతనిపై ఎమ్మెల్యేపై రెచ్చిపోయారు. చిట్టేల టీడీపీ సర్పంచ్‌ శ్రీనివాస్‌ను టార్గెట్‌ చేసి బూతులు తిడుతూ.. ఆయనకు సిగ్గుంటే సర్పంచ్‌గా ఉంటాడా?. సర్పంచ్‌ కనపడితే చెప్పుతో కొడతానంటూ అసభ్యకర పదజాలంతో దూషించడం జరిగింది.

సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలా తమని టార్గెట్‌ చేయడంతో సర్పంచ్‌ ఫ్యామిలీ మనస్తాపానికి గురైంది. ఈక్రమంలోనే సర్పంచ్‌ శ్రీనివాస్‌ను ఇలా తిట్టడంతో ఆయన భార్య, వీఆర్వో కవిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీఆర్వో కవిత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. దీంతో, వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కవిత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

దీనిపై తిరువూరు టీడీపీ నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేను భ‌రించ‌లేం నియోజకవర్గానికి కొత్త ఇన్‌చార్జ్‌ను నియ‌మించాల‌ని, లేదంటే పార్టీ స‌ర్వ‌నాశ‌నం అవుతుంద‌ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస్‌కు ఫిర్యాదు చేయ‌డం సంచలనంగా మారింది. కొలిక‌పూడిపై ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో ఏం చేయాలో టీడీపీ అధిష్టానానికి దిక్కుతోచ‌డం లేదు. ఒక‌వేళ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్నా, ఏదో ఒక‌టి వాగుతూ మ‌రింత న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడ‌ని టీడీపీ అధిష్టానం భయప‌డుతోంది.దీంతో ఎమ్మెల్యేను ఎలా నిరోధించాలో అర్థం కాక టీడీపీ నేతలు ప‌ట్టుకుంటున్నారు. మరి ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్‌పై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!