Friday, October 4, 2024

Telangana Government : రేషన్ కార్డులకు రేవంత్ సర్కారు కోత..వ్యతిరేకిస్తున్న తెలంగాణ సమాజం

- Advertisement -

Telangana Government: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చాలా మంది ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తుండగా, ఇప్పుడు ఉన్న రేషన్ కార్డుల్లో కొందరి పేర్లను తొలగించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.ముఖ్యంగా బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకోసం ప్రభుత్వం రేషన్ కార్డు దారులను ఈ-కేవైసీ చేసుకోవాలని పిలుపునిచ్చింది. రాష్ట్రంలో 15 లక్షల రేషన్‌ కార్డులు రద్దు చేయాలని భావిస్తోంది. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోని వారందరినీ అనర్హులుగా గుర్తించనున్నట్లు సమాచారం. వారి రేషన్ కార్డులు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొత్త రేషన్ కార్డు విధి విధనాలపై ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఇప్పటి వరకు రేషన్ కార్డు లేని లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో చాలా మంది ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోంది. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులో కొంత మంది పేర్లు తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొన్ని రేషణ్ కార్డులను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉండేలా చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం రాష్ట్ర మొత్తం జనాభా 3.83 కోట్లు ఉండగా.. 89.96 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో 89.96 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. అక్టోబర్‌ నుంచి కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా గత పదేళ్లుగా ప్రభుత్వం అర్హులకు రేషన్ కార్డు లు మంజూరు చేయలేదు.

గతం లో అర్హతలను పూర్తి గా విచారించకుండానే రేషన్ కార్డులను ప్రభుత్వాలు జారీ చేశాయి. దీని వల్ల అనర్హులకు కూడా తెల్ల రేషన్ కార్డులు వచ్చాయి. వ్యక్తులు లేకున్నా వారి పేరు పై రేషన్ కార్డులు ఉన్నాయనే ఆరోపణలు కూడా త ర చూ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అనర్హులను గుర్తించేందుకు గతేడాది ఆక్టోబర్ నెలలో నుంచి ఈ–కేవైసీ విధానాన్ని చేపట్టింది. అయితే.. ఈ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు దాదాపు ఆరు సార్లు సమయం పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది మార్చి లో ఈ ప్రక్రియకు ముగింపు పెట్టింది. కాగా ఆరు నెలల సమయం ఇచ్చిన దాదాపు 15 లక్షల మంది ఈ–కేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. ఈ–కేవైసీ చేసుకొని అందరిని రేషన్ కార్డు జాబితా నుంచి తొలిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాటన్నిటి రద్దు చేసేందుకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచినట్లు తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!