Telangana Politics: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారా? అన్నది ప్రధాన చర్చ. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.పైగా బీఆర్ఎస్ కు దక్కాల్సిన పీఏసీ చైర్మన్ పదవి రెబల్ ఎమ్మెల్యేకు కట్టబెట్టారు. అప్పటి నుంచి రాజకీయ వేడి మరింత దుమారం రేపుతోంది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రసాద్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేయడంపై పెద్ద దుమారమే రేగింది. అసలు పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీ వస్తుంది. గత ప్రభుత్వాలన్ని అదే పని చేశాయి. స్పీకర్ ప్రసాద్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్పీకర్ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శించింది. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని మండిపడింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన అరికపూడి గాంధీకీ పీఏసీ ఛైర్మన్ గా స్పీకర్ ప్రకటించడం ఇంతలా వివాదానికి దారితీసింది. ఐతే స్పీకర్ ఈ నిర్ణయం ఆషామాషీగా తీసుకోలేదని.. దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.
అయితే పీఏసీ చైర్మన్ ఎంపికను సమర్థిస్తూ మాట్లాడారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. నిబంధనల ప్రకారమే పీఏసీ ఛైర్మన్ నియామకం జరిగిందని శ్రీధర్ బాబు ప్రకటించారు. ప్రతిపక్ష నేతలకు పీఏసీ ఛైర్మన్ ఇవ్వడం ఆనవాయితీ అదే సాంప్రదాయాన్ని తమ ప్రభుత్వం పాటించదని శ్రీధర్ బాబు ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. శ్రీధర్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలే రాజకీయ కలకలం సృష్టించాయి. అంటే అరికపూడి గాంధీ ఏ పార్టీ అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ లో ఉన్నాడా.. లేక కాంగ్రెస్ లో ఉన్నాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని అరికపూడి గాంధీ ప్రకటించుకున్నారు. అందుకే పీఏసీ ఛైర్మన్ గా స్పీకర్ ప్రకటించారని శ్రీధర్ బాబు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ కు ఒకింత షాక్ కు గురైంది. స్పీకర్ నిర్ణయంపై తీవ్రంగా మండిపడింది.ప్రతిపక్ష పార్టీ ఎవరిని సూచిస్తే.. స్వీకర్ ఆ పదవి వాళ్లకు ఇవ్వడం ఆనవాయితీ. ఇలా స్పీకర్ ఎలా పడితే.. అలా ఈ పదవిపై నిర్ణయం తీసుకోవడంపైనే దుమారం రేగుతుంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. అందులో అరికపూడి గాంధీ ఒకరు. పీఏసీ ఛైర్మన్ గా ఎన్నికైన అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మరి మిగితా 9 మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్లా.. లేక కాంగ్రెస్ వాళ్లా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారా.. అనే సందేహం అందరిలో మెదులుతుంది. అయితే సడన్ గా ఎమ్మెల్యేలు ఇలా స్టాండ్ మార్చడానికి ఒక బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత అంశం నెల రోజుల్లో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఈ పరిణామం కాస్తా రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. అంటే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యను అనర్హత నుంచి బయట పడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహం అమలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్‌లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేవలం తమ నియోజక అభివృద్ధి పనుల కోసమే రేవంత్ రెడ్డి, మంత్రులను కలిశారు తప్పా వారు కాంగ్రెస్ లో చేరలేదనే కొత్త వాదన కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. అంతేకాదు వారు పార్టీ కండువాలు కూడా అధికార పార్టీ కప్పలేదు. ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అధిష్టానం తీరు నచ్చక పార్టీకీ దూరంగా ఉంటున్నారనే కొత్త వాదనను మొదలుపెట్టింది. ఈ పరిణామం ఒకింత బీఆర్ఎస్ కు షాక్ కు గురి చేసిందని చెప్పవచ్చు. అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలను అనర్హత నుంచి బయట పడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తుందని పొలిటికల్ పరిశీలకులు అంటున్నారు. అందులో భాగంగానే అరికపూడి గాంధీనీ పీఏసీ ఛైర్మన్ గా నియమించడం. ఆయనతో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పించడం అందులో భాగమేనని అభిప్రాయపడుతున్నారు.
మున్ముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద సవాళ్లను ఎదుర్కొంటుందని తెలుస్తోంది. పది మంది ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ అంశం ఇప్పుడు చాలా కీలకంగా మారనుంది. దానం నాగేందర్ ఇష్యూలో కాంగ్రెస్ ఏం చేయబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. మిగితా తొమ్మది మంది ఎమ్మెల్యేలను పక్కన పెడితే దానం నాగేందర్ అంశంలో ఒక చిక్కు ముడి ఏర్పడింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున దానం నాగేందర్ పికింద్రాబాద్ బరిలో నిలిచారు. ఇప్పుడు ఇదే దానం నాగేందర్ కు పెద్ద సమస్యగా వచ్చి పడింది. దీంతో దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడింది. అయితే దానం నాగేందర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓ క్లారిటీతోనే ఉందట.