Tuesday, October 8, 2024

Congress: ఉన్నవి ఆరు మంత్రి పదవులు.. ఆశిస్తున్నది ఎంతో మంది

- Advertisement -

Congress: తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం రేవంత్ తేనెతుట్టను కదిలించారు. మంత్రివర్గ విస్తరణ దిశగ అడుగులు వేస్తున్నారు. దీంతో ఆశావహులు ఎవరికి వారే కాంగ్రెస్ మార్కు రాజకీయాలతో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మంత్రివర్గ కూర్పు ఇప్పుడు రేవంత్ కు మించిన పని. మంత్రి పదవులు ఇస్తామనిహామీతో చాలా మందిని ఎన్నికల ముందు చేర్చుకున్నారు. బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయాలన్న వ్యూహంతో మరికొందర్ని ఆకర్షించారు. వారందరికీ పదవులు ఇవ్వాలంటే ఇప్పుడు కుదిరే పని కాదు. అలాగని ఇవ్వకుంటే మాత్రం అసంత్రుప్తులు పెరిగిపోయే అవకాశం ఉంది. అందుకే కక్కలేక మింగలేని పరిస్థితులుల్లోసీఎం రేవంత్ ఉన్నారు.

గత ఏడాదిగా సీఎం రేవంత్ రెడ్డి జోడు ప‌ద‌వుల‌లో కొన‌సాగారు. పీసీసీ చీఫ్‌గా మ‌హేష్ కుమార్ గౌడ్‌ను నియ‌మించ‌డంతో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ బాధ్యతల నుంచి ఫ్రీ అయ్యారు. ఇక సాధ్యమైనంత తొంద‌ర‌గా మంత్రివర్గ విస్తర‌ణ పూర్తి చేయాల‌ని సీఎం డిసైడ్‌ అయినట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు క్యాబినెట్‌ విస్తరణకు పీసీసీ చీఫ్‌ నియామకమే అడ్డుగా ఉండేది. సామాజిక సమీకరణల దృష్ట్యా ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే తర్జనభర్జన కొనసాగింది. ఇప్పుడు పీసీసీ పీఠముడి వీడిపోవడంతో మంత్రి వర్గ కూర్పు ప్రభుత్వానికి సవాల్‌గా మారిందంటున్నారు విశ్లేషకులు.

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో క‌లుపుకుని 11 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా ఆరు ఖాళీలు ఉండగా, ఆశావహులు భారీ క్యూలో ఉన్నారు. ఎలాగైనా మంత్రి పదవి కైవసం చేసుకుని బుగ్గ కారులో తిరిగేయాలని త‌హ‌త‌హలాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ పెద్దల ఆశీస్సుల కోసం హైదరాబాద్‌, ఢిల్లీ మధ్య చక్కర్లు కొడుతున్నారు. కులం, బలం, ప్రాంతం వంటి లెక్కలన్నీ వివరిస్తూ తమ అర్హతలను పరిశీలించాల్సిందిగా వేడుకుంటున్నారు. దీంతో ఆశావహుల్లో వడపోతకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధిష్టానంతో సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, హైద‌రాబాద్ జిల్లాల నుంచి ఎవరికీ ప్రాతినిధ్యం లేదు. ఈ విస్తర‌ణ‌లో ఆయా జిల్లాలకు కేబినెట్ ప్రాతినిధ్యం ఇవ్వాల‌ని భావిస్తున్నారు సీఎం. దీంతోపాటు ఆరు బెర్తుల్లో రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవ‌కాశమిచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కేబినెట్ రేస్‌లో రంగారెడ్డి జిల్లా నుంచి మ‌ల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహ‌న్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ సోద‌రులు, ఎడ్మ బొజ్జు, ప్రేమ్‌సాగ‌ర్ రావు ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక నిజామాబాద్ నుంచి సుద‌ర్శన్‌రెడ్డికి దాదాపు బెర్త్ క‌న్ఫామ్ అయ్యింద‌న్నది టాక్. న‌ల్గొండ నుంచి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, బాలు నాయ‌క్ పోటీ పడుతుండగా.. హైద‌రాబాద్ నుంచి దానం నాగేంద‌ర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వీరిలో ఎవ‌రికి హైక‌మాండ్ క‌టాక్షం ద‌క్కుతుందన్న చ‌ర్చ సాగుతోంది.

అయితే మంత్రివర్గ విస్తరణ తరువాత రాజకీయాలు సమూలంగా మారే అవకాశముంది. ఇప్పటికే కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలై అనర్హత వేటు కత్తి వేలాడుతోంది. స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి. అందుకే మిగతా ఎమ్మెల్యేలు తామంతా బీఆర్ఎస్ వారిమేనని చెప్పుకునే దాకా పరిస్థితి వచ్చింది. ఒక వైపు అనర్హత వేటు భయం కొనసాగుతుండగా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కకుటే వారు మాత్రు పార్టీలోకి వెళ్లే అవకాశం కూడా ఉందని ప్రచారం సాగుతోంది ఇలా ఎల చూసుకున్నా మంత్రివర్గ విస్తరణ రేవంత్ కు ఒక సాహస చర్యే.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!