Tuesday, October 8, 2024

Chandrababu: జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు.. మరో బాంబు పేల్చిన చంద్రబాబు

- Advertisement -

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ సీఎం చంద్రబాబు బాంబు పేల్చారు. ఇటీవలే అధికారంలోకి రావడం.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రం, దానికి తోడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు భారీ వరదలు. నిధులు లేవని, అందుకే ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామని ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి.. అందునా గతంలో రాష్ట్రాన్ని పాలించిన అనుభవం ఉండి కూడా అలా మాట్లాడడం ఏంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద విపత్తుతో వేలాది కోట్ల నష్టం వాటిల్లింది. బాధితులు ఇప్పటికీ లక్షల్లో ఉన్నారు. వారంతా గత కొన్ని రోజులుగా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వరద సాయాన్ని ప్రకటించినప్పటికీ అది పూర్తి స్థాయిలో ఉపయోగపడలేదు. మరోవైపు పెద్దఎత్తున సహాయక చర్యలను అందించడంలో ప్రభుత్వం సైతం విఫలమైంది.

కేంద్రం తమ వద్ద డబ్బులు ఉన్నాయని అనుకుంటోందని, కానీ రాష్ట్రంలో పరిస్థితి దుర్భరంగా ఉందని తెలియజేస్తూ లేఖ రాస్తామని చంద్రబాబు అన్నారు. కనీసం ప్రస్తుతం రాష్ట్రం ఉన్న స్థితిలో జీతాలు ఇవ్వడానికి కూడా కష్టంగా ఉందంటూ బాంబు పేల్చారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా కాక మునుపే చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయని, తద్వారా ప్రతి కుటుంబం నష్టాల పాలైందని తెలిపారు. ఈ లోటును పూడ్చేందుకే తమ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుందని మీడియా ముఖంగా చంద్రబాబు స్పష్టం చేశారు. మరి సంపద సృష్టిస్తానని సభలు, సమావేశాల్లో ఊదరగొట్టి.. అమలు కాని హామీలు కురిపించి రాష్ట్ర ప్రజలను అమాయకులను చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో పది, పన్నెండు రోజుల్లో సామాజిక పెన్షన్లతో పాటు ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించాల్సిన ప్రభుత్వం మరి ఏ విధంగా ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తుందని వైసీపీ నిలదీస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!