Friday, October 4, 2024

ఇది సార్ జగన్ బ్రాండ్.. చంద్రబాబు అడ్డాలో వైసీపీ మాస్ సెలబ్రేషన్స్

- Advertisement -

ఓడిపోయినప్పటికి జగన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువు అయింది. 2019 ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసి 151 అసెంబ్లీ సీట్లలో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. తన ఐదేళ్ల పాలన గ్రామ స్వరాజ్య పాలనకు ఆయన పాటుపడ్డారు. ప్రతి ఇంటికి తన పథకాలు అందేలా చేశారాయాన. ఇదే సమయంలో విద్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, పేదవారికి సైతం కార్ప రేట్ విద్యను అందించడంలో తనవంతు పాత్ర పోషించారు.అయితే ప్రజా పాలనను అందించడంతో సక్సెస్ అయినంతగా , ప్రభుత్వాన్ని నడపటంలో మాత్రం కొంత ఫెయిల్ అయ్యారు.

ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత మూటకట్టుకున్నారు. దీని కారణంగా ఆయన గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. గత ఎన్నికల్లో జగన్ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయినప్పటికి ప్రజల్లో జగన్ క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఇంకా చెప్పాలంటే అధికారంలో ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల కంటే జగన్ బయటకు వచ్చినప్పుడు ప్రజలు తండోపతండాలుగా తరలి రావడం కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి జగన్ వచ్చినప్పుడు జనం వచ్చిన తీరును చూస్తే ఇది అర్థం అవుతోంది.

తాజాగా వినాయక చవతి సెలబ్రేషన్స్‌లో కూడా జగన్ పాటలతో అభిమానులు హల్ చేస్తున్నారు. ఏపీలో అంటే జగన్ అభిమానులుంటారు చేస్తారులే అనుకోవచ్చు. కానీ తెలంగాణలో కూడా జగన్ పాటలతో అభిమానులు చిందులు వేయడం జరిగింది. తాజాగా కూకట్‌పల్లిలో వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమంలో జగన్ పాటలతో అభిమానులు సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక ఏపీలో కూడా ఇలాంటి ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. మహిళలు సైతం జగన్ పాటలకు డ్యాన్స్ వేస్తూ కనిపించారు.అయితే ఇలా జగన్ పాటకు డ్యాన్స్ వేసినందకు ప్రభుత్వం కక్ష తీర్చుకుంది. సంబందిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం ఆశ్చర్యం కలిగింది. జగన్ పాటకే ఇంత భయపడితే, ఇంకా జగన్‌కు ఈ కూటమి ప్రభుత్వం ఎంతలా భయపడుతుందో అర్థం అవుతుందంటూ వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!