Sunday, October 13, 2024

Komati reddy: కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కోసం మంత్రి పదవికి వెంకటరెడ్డి రాజీనామా

- Advertisement -

Komati reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారా? సోదరుడు రాజగోపాలరెడ్డికి మంత్రి పదవి లభించకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారా? కనీసం టీపీసీసీ అధ్యక్ష పీఠం అయినా దక్కుతుందని భావించారా? దక్కకపోయేసరికి తీవ్ర నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ ప్రత్యేక చొరవతో రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. కులం,కుటుంబ సమీకరణలతో పని లేకుండా మంత్రి పదవి ఇప్పించే బాధ్యత తనది అంటూ రేవంత్ హామీ ఇచ్చారు. కానీ హామీని ఇంతవరకూ నిలబెట్టుకోలేకపోయారు. దీంతో సోదరుడు కోసం వెంకటరెడ్డి మంత్రి పదవి వదులుకునేందుకు సిద్ధపడినట్టు ప్రచారం ప్రారంభమైంది.

బిజినెస్ మెన్ గా ఉండి రాజకీయాలకు వచ్చిన నాయకుడైన రాజగోపాల్ రెడ్డి అతి తక్కువ కాలంలోనే తన కంటూ ఓ పొలిటికల్ ఇమేజ్ ను ఏర్పర్చుకున్నారు. సోదరుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రోద్భలం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 2009లో రాజగోపాల్ రెడ్డి రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాలకు వచ్చిరాగానే భువనగిరి ఎంపీగా ఎన్నికయ్యారు. నాటి నుంచి రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంపీగా తన వాయిస్ వినిపించారు.తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. వరుస ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఎంపీగా ఓడినా ఎమ్మెల్సీ రూపంలో వచ్చిన అవకాశాన్ని రాజగోపాల్ రెడ్డి సద్వినియోగం చేసుకున్నారు. నల్లగొండ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అలా రాజకీయంగా ఎప్పుడూ క్రియాశీలంగా ఉంటూ వస్తున్నారు. అప్పటికే సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలో తన కంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పర్చుకున్నారు. వెంకటరెడ్డికి తోడుగా రాజగోపాల్ రెడ్డి జత కలవడంతో నల్లగొండ జిల్లా రాజకీయాల్లో వీళ్ల హవా కొనసాగుతూ వస్తుంది. ఇలా ఈ ఇద్దరు సోదరులు నల్లగొండ జిల్లాలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వ్యూహాలు రచిస్తూ వచ్చారు.

ఇంత వరకు బాగానే ఉన్నా బీఆర్ఎస్ తో ఈ పొలిటికల్ బ్రదర్స్ కు పెద్ద కష్టమే వచ్చి పడింది. 2014, 2019 వరుస విజయాలతో బీఆర్ఎస్ తెలంగాణలో రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించింది. మునుగోడు మినహా అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకుంది. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డిని బీఆర్ఎస్ రాజీకీయంగా ఇబ్బందులకు గురి చేసింది. దీంతో ఏం చేయాల తోచని స్థితిలో రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక రావడం అక్కడ కూడా బీఆర్ఎస్ గెలవడం చకచకా జరిగిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి చేరితే ఐనా రాజకీయంగా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చనుకున్న రాజగోపాల్ రెడ్డి ఆశ నెరవేరలేదు. మునుగోడు లో ఓటమి తర్వాత కూల్ అయ్యారు. ఇదే సమయంలో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్దమైంది.

వరుసగా రెండు సార్లు గెలుపొందిని బీఆర్ఎస్ పై జనాల్లో కొంత వ్యతిరేకత ఏర్పడింది. దీనికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ కు కాస్తా సానుకూల వాతవారణం ఏర్పడింది. దీంతో రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ తరుపున మునుగోడు బరిలో నిలబడి భారీ విజయం సాధించారు. అంతే కాదు జిల్లాలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనపడింది. సూర్యపేట మినహా అన్ని స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ అలర్ట్ అయ్యారు. జిల్లా రాజకీయాలు తమ చెప్పుచేతుల్లో ఉండాలనే ఉద్దేశంతో పావులు కదపడం మొదలు పెట్టారు. కానీ ఈ బ్రదర్స్ కు జిల్లాకు చెందిన మరో కుటుంబంతో పోటీ ఏర్పడింది. అప్పటికే కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉండి, అధిష్టానానికి అత్యంత సన్నిహితుడిగా మెదులుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తో రాజీకయ వైరి మొదలైంది. ఒకటే పార్టీ ఐనా జిల్లా రాజకీయాల్లో పట్టుకోసం ఈ రెండు కుటుంబాలు రాజకీయాలు షురూ చేశాయి.

మొన్నటి ఎన్నికల్లో ఉత్తమ్ దంపతులు గెలవగా, అదే సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా గెలుపొందారు. దీంతో మంత్రి పదవుల కోసం పేచీ మొదలైంది. సీనియర్లు ఐనా ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు మంత్రి పదవులు రాగా, ఉత్తమ్ పద్మావతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు మాత్రం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరు సమయంలోనే రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిందనేది ఆయన అనచరుల మాట. దీంతో తనకు ఎలాగైనా మంత్రి పదవి వస్తుందని రాజగోపాల్ రెడ్డి కోటి ఆశలు పెట్టకున్నారు. అయితే రాజగోపాలరెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని సీఎం రేవంత్ చెబుతున్నారు. కానీ అడ్డంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచే వస్తోందని.. ఆయన తన భార్యకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఉత్తమ్ ను అడుగుతుంటే తనకు అభ్యంతరం లేదంటున్నారు. మరోవైపు ఉమ్మడి నల్గొండకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఎస్టీ వర్గానికి చెందిన బలరాం నాయక్ కు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీ స్థానం గెలిపించే బాధ్యతను కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి భుజస్కందాలపై పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంచి పదవి దక్కుతుందని భరోసా ఇచ్చారు. అనుకున్నట్టే కిరణ్ కుమార్ రెడ్డి భారీ విజయం సాధించారు.అయితే ఇప్పుడు మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు షురూ చేశారు. మంత్రి పదవిపై రేవంత్ రెడ్డి నుంచి కూడా భరోసా వచ్చింది కానీ అధిష్టానం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదనే చర్చ గాంధీ భవన్ లో జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతుంది ఉత్తమ్ ఫ్యామిలీ అని జిల్లాలో చర్చ. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన భార్య పద్మావతికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ పెద్దల ముందు ఉత్తమ్ డిమాండ్ పెడుతున్నట్లు తెలిసింది. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం పెద్ద సమస్యగా మారింది.అందుకే సోదరుడు కోసం వెంకటరెడ్డి రాజీనామా బాట పడుతున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!