Tuesday, October 8, 2024

Chandrababu: చంద్రబాబు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన వాలంటీర్లు

- Advertisement -

Chandrababu: వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ మనుస్సు మార్చుకుంటుందా అంటే అవననే అంటున్నాయి రాజకీయా వర్గాలు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థపై నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారు.2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద యుద్దమే నడించింది. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

వారికి టీడీపీ నేతలు సైతం గట్టిగానే కౌంటరిచ్చారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు గౌరవ వేతనం రూ. 10,000 చేస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. అయినప్పటికి కూడా కొందరు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు గౌరవ వేతనం రూ. 10,000 చేస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. అయినప్పటికి కూడా కొందరు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు వాలంటీర్ల నుంచి తప్పించుకోవడానికి టీడీపీ ప్రభుత్వం సాకులు వెతుకుతునట్టు కనిపిస్తోంది.

గ్రామానికి కేవలం 5 మంది వాలంటీర్లను మాత్రమే తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై విధి, విధానాలు రూపొందించిన తర్వాత వాలంటీర్ వ్యవస్థపై కీలక ప్రకటన చేయడానికి టీడీపీ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచుల సంఘం తీర్మానించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర‌ప్రసాద్ తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు తమ ఒక నెల జీతాన్ని రాజధాని అమరావతికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ ఉండకపోవచ్చనే వాదనకు ఈ చర్య మరింత బలం చేకూర్చినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో వాలంటీర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాల‌ని, ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాల‌ని కోరారు. ఈ నేపథ్యంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనా ఉద్యోగ భద్రత కల్పించకపోవడంతో 2.60 లక్షల మంది పరిస్థితి గందరగోళంగా మారిందన్నారు. వచ్చే కేబినెట్ సమావేశం లోపు న్యాయం చేయకుంటే సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం రేపటి (సెప్టెంబర్ 26) నుంచి అక్టోబర్ 2 వరకు గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఆందోళనలు చేస్తామని వాలంటీర్లు తెలిపారు. మరి ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటారో లేదా.. ఎప్పటిలాగే హామీలను గాలికి వదిలేసినట్టుగా వాలంటీర్లను సైడ్ చేస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!