Thursday, October 3, 2024

AP Government: చంద్రబాబు వంద రోజుల పాలనపై వైసీపీ సూటి ప్రశ్నలు

- Advertisement -

AP Government:ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. తాజాగా వంద రోజుల పాలన కూడా పూర్తి చేసుకుంది. మరి ఈ వంద రోజులలో సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమిటి? రాష్ట్రంలో ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందా? ప్రజల కష్టాలు తీరి వారి మొహాల్లో చిరునవ్వు కనబడుతుందా? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు సరిగ్గానే జరుగుతుందా? ఇలాంటి ఎన్నో అనుమానాలు ఇప్పుడు అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం తన సోషల్ మీడియా వేదికగా కూటమి వంద రోజుల పాలనపై ప్రశ్నలు సంధించారు. విపత్తు నిర్వహణలో పూర్తిగా విఫలం చెందిన చంద్రబాబు స్ట్రైక్  రేట్ ఎంత? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి ఎందుకు పట్టించుకోలేదు? లాంటి ప్రశ్నలను ‘ఎక్స్‌’లో పోస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద రోజుల పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ వంద రోజుల్లో వెయ్యి అడుగులు వేసామన్న సర్కార్ బడుగు బలహీన వర్గాల మనస్సులను గాయపర్చిందా అని అన్నారు. మరి ప్రభుత్వ పాలనతో రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు సంతృప్తిగానే ఉన్నారా? లేదంటే ఎందుకో జవాబు చెప్పాలని కోరారు. మరోవైపు, రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. కుల ప్రాతిపదిక ప్రామాణికంగా ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీలు జరిగాయన్న విమర్శలపై ఏం సమాధానం చెప్తారని అడిగారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, దౌర్జన్యాలపై ప్రజలదే అంతిమ నిర్ణయం అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి కామెంట్స్‌ చేశారు

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!